ETV Bharat / international

భారతీయ-అమెరికన్ల మద్దతు పట్ల ట్రంప్ ఖుషీ

భారతీయ అమెరికన్ల నుంచి తనకు మద్దతు లభించడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతగా భావిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్లు పోషిస్తున్న పాత్రను ట్రంప్ గుర్తించినట్లు పేర్కొంది. నవంబర్​లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు ట్రంప్​ వైపే మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ శ్వేతసౌధం ఈ విధంగా స్పందించింది.

author img

By

Published : Jun 27, 2020, 5:59 PM IST

http://10.10.50.85:6060//finalout4/maharashtra-nle/thumbnail/27-June-2020/7791061_266_7791061_1593242462251.png
భారతీయ-అమెరికన్ల మద్దతు పట్ల ట్రంప్ ఖుషీ

భారతీయులు, భారతీయ అమెరికన్ల నుంచి తనకు విస్తృతమైన మద్దతు లభించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతగా భావిస్తున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. నవంబర్​లో జరగనున్న ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో 50 శాతానికిపైగా భారతీయులు ట్రంప్​వైపే మొగ్గుచూపుతున్నారన్న సర్వేకు స్పందనగా ఈ విషయం వెల్లడించింది.

సాధారణంగా డెమొక్రటిక్ పార్టీకి ఓటేసే వీరంతా ట్రంప్​ వైపు మరలుతున్నట్లు శ్వేతసౌధ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సారా మాథ్యూస్ తెలిపారు.

"నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో వైట్​హౌస్​​కు తిరిగి ఎన్నికవ్వాలని ట్రంప్ కోరుకుంటున్నారు. భారతీయులతో పాటు దేశంలో ఉన్న లక్షలాది భారతీయ అమెరికన్ల మద్దతు లభించడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ చాలా కృతజ్ఞతగా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, సంస్కృతి సాంప్రదాయాల ద్వారా అమెరికా సమాజాన్ని మరింత బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్ర చాలా ముఖ్యమైనదని ట్రంప్ గుర్తించారు. తొలి రెండేళ్లలో చరిత్రలో గొప్ప ఆర్థిక పునరాగమనం దిశగా అమెరికాను నడిపించారు. ట్రంప్ చర్యల వల్ల భారతీయ అమెరికన్లలో నిరుద్యోగం 33 శాతం మేర తగ్గింది."

-సారా మాథ్యూస్, శ్వేతసౌధ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ

కష్టపడి పనిచేసే భారతీయ అమెరికన్ల శ్రేయస్సు కోసం అధ్యక్షుడు అన్ని విధాలుగా పోరాడుతూనే ఉంటారని సారా స్పష్టం చేశారు. అమెరికన్లతో పాటు వీరందరికీ ఆరోగ్యం, స్వేచ్ఛ లభించేలా పాటుపడతారని పేర్కొన్నారు.

మోదీనే కారణం!

ట్రంప్ వైస్రాయ్ ఇండియన్-అమెరికన్ ఫైనాన్స్ కమిటీ కో-ఛైర్మన్ అల్ మసన్ నిర్వహించిన సర్వే ప్రకారం మిషిగన్, ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా, వర్జీనియా వంటి కీలక స్థానాల్లో 50 శాతానికి పైగా భారతీయ అమెరికన్లు ట్రంప్​ వైపే మొగ్గుచూపుతున్నారని తేలింది. ప్రధాని మోదీతో ట్రంప్ సత్సంబంధాలు కలిగి ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరువురు కలిసి హ్యూస్టన్, అహ్మదాబాద్​లలో నిర్వహించిన భారీ సభలలో పాల్గొనడం వల్ల భారతీయ అమెరికన్ల మద్దతు పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడున్నర సంవత్సరాల పాలనలో భారతీయ-అమెరికన్ల కోసం ట్రంప్ అధిక శ్రద్ధ కనబర్చారని అల్​ మసన్ వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్​ను సందర్శించడం ఇరుదేశాల సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాయని పేర్కొన్నారు. భారత్​ పట్ల తమకున్న అపారమైన ప్రేమ, గౌరవాన్ని ట్రంప్ చాటుకున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: ఇక విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.