ETV Bharat / international

ఫౌచీ మాటలు విని ప్రజలు విసిగిపోయారు: ట్రంప్​ - అధ్యక్ష ఎన్నికలు 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సొంత యంత్రాంగంపై విరుచుకుపడ్డారు అధ్యక్షుడు ట్రంప్​. ఆంటోనీ ఫౌచీ మాటలు విని ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. ఫౌచీ బృందాన్ని 'ఇడియట్స్​' అని సంబోధించారు. అధ్యక్షుడికి కరోనా సోకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఫౌచీ చెప్పిన నేపథ్యంలో ట్రంప్​ ఈ స్థాయిలో విమర్శలు చేశారు.

Trump goes after Fauci, tries to buck up his campaign team
ఫౌచి మాటలు విని ప్రజలు విసిగిపోయారు: ట్రంప్​
author img

By

Published : Oct 20, 2020, 9:06 AM IST

అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఫౌచీపై విరుచుకుపడ్డారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఫౌచీ, ఆయన బృందం మాటలకు ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత యంత్రాంగంలోని వారిపై ట్రంప్​ విమర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇటీవలే ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఫౌచీ. ట్రంప్​నకు కరోనా సోకిందన్న వార్త విని తనకు ఆశ్చర్యం కలగలేదని.. భారీ వేడుక నిర్వహించిన అనంతరం ఇది సహజమే అని వ్యాఖ్యానించారు. ఆ వేడుకలో ఎవరూ సరిగ్గా మాస్కులు పెట్టుకోలేదని.. భౌతిక దూరాన్ని కూడా పాటించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఫౌచీపై మండిపడ్డారు ట్రంప్​.

"ఫౌచీతో పాటు ఈ ఇడియట్స్​ మాటలు వినీ విని ప్రజలు విసిగిపోయారు. టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారీ బాంబు పేలినట్టు ఉంటుంది. అయినా ఆయన్ని విధుల నుంచి తొలగించలేము. కానీ ఆయన దారుణంగా విఫలమయ్యారు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

'మళ్లీ నేనే...'

మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. చివరి నిమిషంలో ట్రంప్​ అద్భుతాలు సృష్టించాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​పై ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులను పక్కనపెట్టి మరీ విపరీతంగా పర్యటనలు సాగిస్తున్నారు. మరోసారి తాను అధ్యక్ష పదవిని చేపడతానని తన మద్దతుదారులకు చెబుతున్నారు.

అయితే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటం, ఫౌచీ లాంటి వ్యక్తిపై బహిరంగంగా విమర్శలు చేయడం.. ట్రంప్​నకు ప్రతికూలంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి- అధికారంలో మరో నాలుగేళ్లు మనమే: ట్రంప్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.