ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల వాయిదాకు ట్రంప్​ వ్యూహం! - america election delay

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆలస్యంగా జరగొచ్చా? అంటే అవును అంటోంది ట్రంప్ సర్కార్​. ఓటింగ్​ విషయంలో మోసాలే ఈ జాప్యానికి కారణం కావొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Trump floats election 'delay' amid claims of voting fraudTrump floats election 'delay' amid claims of voting fraud
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడొచ్చా..?
author img

By

Published : Jul 30, 2020, 10:13 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ట్రంప్ ట్వీట్​ చర్చనీయాంశంగా మారింది. నవంబర్​ 3న జరగనున్న ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగొచ్చని డొనాల్డ్ గురువారం ట్విట్టర్​ వేదికగా​ అభిప్రాయపడ్డారు. మెయిల్​ ఇన్​ ఓటింగ్​ ఫలితాల్లో మోసాలు జరగడమే ఇందుకు కారణంగా ఆయన ఆరోపించారు.

"యూనివర్సెస్​ మెయిల్​ ఇన్​ ఓటింగ్​-2020 మోసపూరితం. ఇది యుఎస్‌ఎకు గొప్ప ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు సరిగ్గా, సురక్షితంగా ఓటు వేసే వరకు ఎన్నికలు ఆలస్యం అవుతాయా?" అని ట్రంప్​ ప్రశ్నించారు.

అన్ని మెయిల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో.. మెయిల్-ఇన్ ఓటింగ్ ద్వారా మోసం జరిగిందని ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటికే ఐదు రాష్ట్రాలు మెయిల్-ఇన్ బ్యాలెట్లపై ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విదేశీ శత్రువులు ఓటుకు అంతరాయం కలిగించకుండా చూసుకోవడానికి అవసరమైన భద్రతలు తమ వద్ద ఉన్నాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి.

రాజ్యాంగ సవరణ అవసరం..

అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే అక్కడి రాజ్యాంగం ఒప్పుకోదు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవీ స్వీకారం చేసిన నాలుగేళ్ల తర్వాత వచ్చే నవంబరు తొలి మంగళవారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్​ కాలేజీకి ఎన్నికలు జరగాలి. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగం సవరించాలి. ట్రంప్​ ప్రభుత్వం అందుకు సిద్ధమైనా ప్రస్తుతం డెమొక్రాట్ల ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.

కరోనా కట్టడిలో వైఫల్యం, జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆందోళనలు, వలస విధానంలో మార్పుల వంటి పరిణామాల నేపథ్యంలో.. ప్రత్యర్థి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ట్రంప్‌ కంటే ముందున్నారని ఇటీవల పలు సర్వేల్లో తేలింది. అయితే, అవన్నీ నకిలీ సర్వేలంటూ ట్రంప్‌ వాటిని కొట్టిపారేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.