ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడికి కరోనా సెగ - దిద్దుబాటు చర్యల్లో బిజీ! - కరోనా వైరస్ వార్తలు

అమెరికాలో షట్​డౌన్​ ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోన్న ఆ దేశ అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పటిష్ఠమైన భద్రత ఉండే శ్వేతసౌధంలోనే కరోనా పాజిటివ్ తేలటం అమెరికాలో కరోనా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. టెస్టింగ్ సామర్థ్యం పెంపునకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు అందరికీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

VIRUS-TRUMP
ట్రంప్​నకూ కరోనా సెగ
author img

By

Published : May 12, 2020, 11:01 AM IST

ప్రపంచంలో అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి భవనం శ్వేతసౌధానికి కరోనా సెగ తగిలింది. అందులో పని చేసే ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్​ తేలటం ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

అమెరికాలో ప్రత్యేక భద్రత వర్గంలోని ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​తో సహా ముగ్గురు ఉన్నత వైద్య నిపుణులు కరోనా కారణంగా క్వారంటైన్​లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రత కోసం కొత్త రక్షణ చర్యలు తీసుకున్నారు అధికారులు.

ఇందులో భాగంగానే శ్వేతసౌధం పశ్చిమ విభాగానికి వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధన అధ్యక్షుడికి మాత్రం వర్తించదు. శ్వేతసౌధంలోని రోజ్​ గార్డెన్​లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అందరూ మాస్కులతో దర్శనం ఇవ్వటం ఇదే తొలిసారి.

చర్యలకు సిద్ధమైన ట్రంప్..

ఈ దృశ్యం అమెరికాలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. అయితే అమెరికా ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ట్రంప్ పట్టుబడుతున్న సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అగ్రరాజ్యంలో కరాళ నృత్యం చేస్తోన్న కరోనా నుంచి ప్రజలకు భరోసా కల్పించటం ట్రంప్​ ముందున్న అతి పెద్ద సవాలు.

తాజా మీడియా సమావేశంలో ఈ విషయంపైనే ట్రంప్ ఎక్కువ దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. స్వతహాగా మాస్కు ధరించనని చెప్పిన ట్రంప్​.. ప్రజలు సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరిస్తారనే నమ్మకంతో వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలను నొక్కి చెప్పేందుకు ప్రయత్నించారు. నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచి కరోనాపై విజయం సాధించాలని అధికారులకు నిర్దేశించారు.

పరీక్షల సంఖ్య పెంపునకు..

దేశంలో సరిపడ టెస్టింగ్ కిట్లు ఉన్నాయని చెప్పేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఈ స్థాయిలో పరీక్షించే సామర్థ్యం లేదని నిపుణులు చెబుతున్నా.. ప్రతి ఒక్కరికీ టెస్టులు చేస్తామని స్పష్టం చేశారు. పరీక్ష చేయించుకోవాలనుకునే వారికి టెస్ట్ చేస్తామని ఆ తర్వాత అధికారులు స్పష్టతనిచ్చారు.

నర్సింగ్‌హోమ్‌లతో పాటు ఇతర సీనియర్ కేర్ సదుపాయాల్లో పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు వచ్చే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు సూచించారు.

ఇదీ చూడండి: 'అందరినీ అన్నిసార్లు ఫూల్ చేయడం కుదరదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.