ETV Bharat / international

ట్రంప్​ 'విదేశీ' వ్యాఖ్యలు- ప్రతిపక్షం చురకలు - డెమ్రోక్రట్లు

2020- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించి విదేశాల నుండి అందే సమాచారాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యంపై అనుమానాలు పెంచాయి. ట్రంప్​పై ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ట్రంప్​ 'విదేశీ' వ్యాఖ్యలు- ప్రతిపక్షం చురకలు
author img

By

Published : Jun 14, 2019, 10:57 AM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ పెద్ద వివాదమే నడిచింది. ఈ విషయంపై మ్యూలర్​ నివేదిక ట్రంప్​నకు క్లీన్​చిట్​ ఇవ్వడం వల్ల కాస్త దుమారం సద్దుమణిగింది. అయితే తాజాగా చల్లారిన అగ్నికి ట్రంప్​ ఆజ్యం పోశారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించిన సమాచారం విదేశాలు ఇస్తానంటే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్​ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి పెను దుమారానికి తెరతీశాయి.

ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ముఖాముఖిలో ట్రంప్‌ ఈ విషయం ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్ధి విదేశీ సహాయాన్ని పొందడంలో తప్పేమీ లేదని వాదించారు. అంటే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు విదేశాల నుండి కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని ట్రంప్‌ చెప్పారు.

రష్యా, చైనాలు ప్రత్యర్ధిపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధపడితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ సహాయం తీసుకోవడం వరకు తప్పేమీ లేదని, అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదన్నారు. సమాచారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

డెమోక్రాట్ల చురకలు...

ట్రంప్‌ వ్యాఖ్యలపై డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఆగ్రహించారు. అమెరికా ఓటింగ్‌లో విదేశీ జోక్యాన్ని ట్రంప్‌ స్వాగతిస్తున్నారని ఆరోపించారు. విదేశీ జోక్యం ఒక్క రాజకీయాలకే పరిమితం కాదని, దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలనుకునేవారి సహాయాన్ని అమెరికా అధ్యక్షుడు కోరకూడదని ఆయన ట్వీట్‌ చేశారు.

జో బిడెన్​
జో బిడెన్​

మరికొంతమంది డెమోక్రట్​ సభ్యలు ట్రంప్​ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందనడానికి ట్రంప్​ మాటలు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'శాంతి చర్చలకు సిద్ధంగా లేం'

Intro:Body:

rere

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.