అమెరికాపై సైబర్ దాడి వెనుక రష్యా హస్తం ఉందంటూ అగ్రరాజ్యం మొత్తం ఆరోపిస్తున్న నేపథ్యంలో.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా ఈ సాహసం చేయలేదని.. ఇది కచ్చితంగా చైనా చేసిన పనే అని అభిప్రాయపడ్డారు. అధికారుల దృష్టిని రష్యా నుంచి చైనాపైకి మరల్చే ప్రయత్నం చేశారు. జరిగిన దాడిని నకిలీ మీడియా సంస్థలు ఎక్కువ చేసి చూపిస్తున్నాయని మండిపడ్డారు. చైనాపై ఆరోపణలు చేసేందుకు.. మీడియా భయపడుతుందని తెలిపారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు శ్వేతసౌధం ఇంకా స్పందించలేదు.
అంతకుముందు.. అమెరికాపై సైబర్ దాడి రష్యన్ హ్యాకర్ల పనేనని మైక్ పాంపియో స్పష్టం చేశారు. అమెరికా జీవనశైలి, వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్న దేశాల్లో రష్యా కూడా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి : సైబర్ దాడి వెనుక రష్యా హస్తం: పాంపియో