ETV Bharat / international

శాంతియుత అధికార బదిలీకి ట్రంప్​ నిరాకరణ​ - Trump comments on mail-in ballots

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. నవంబర్​ 3న జరిగే ఎన్నికల్లో ఓడిపోతే శాంతియుతంగా అధికార బదిలీకి పాల్పడేందుకు నిరాకరించారు. మెయిల్​ ఇన్​ ఓటింగ్​ విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ట్రంప్​.. మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Trump declines  to commit to peaceful transfer of power, expresses concerns about mail-in ballots
శాంతియుత అధికార బదిలీకి ట్రంప్​ నిరాకరణ​
author img

By

Published : Sep 24, 2020, 10:58 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. నవంబర్​ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే శ్వేతసౌధాన్ని శాంతియుతంగా విడిచిపెడతారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు ట్రంప్​.

ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాన్న ట్రంప్‌.. దాని వల్ల తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు. ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ ఓట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. నెలరోజులుగా ట్విట్టర్‌తో సహా పలు వేదికలపై ట్రంప్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. విస్తృతమైన మెయిల్‌ ఓటింగ్‌ విధానం సురక్షితం కాదన్న ఆయన.. దీని వల్ల భారీ మోసాలు జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.

బ్యాలెట్ విధానానికి రాష్ట్రాలు దూరంగా ఉంటే.. ఎన్నికల్లో జరిగే మోసాలను అరకట్టవచ్చని సూచించారు ట్రంప్​. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.