మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్, హొండురస్, గ్వాటెమాలా దేశాలకు ఆర్థిక సాయాన్ని నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు దేశాలకు 2017, 18 సంవత్సరాలకు గాను రావాల్సిన సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
కారణం..
మెక్సికో నుంచి అమెరికా సరిహద్దుకు చేరుకొంటున్న అక్రమ వలసదారులకు ఈ మూడు దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నట్లు అమెరికా గుర్తించింది. అందుకే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఖండించిన డెమొక్రాట్లు..
ఆర్థిక సాయాన్ని నిలిపివేయడాన్ని డెమొక్రాట్లు తీవ్రంగా ఖండించారు. ఇది మధ్య అమెరికా దేశాల్లోని కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.