ETV Bharat / international

ట్రంప్​కు షాక్.. పిటిషన్లను కొట్టేసిన కోర్టులు

author img

By

Published : Nov 6, 2020, 6:55 AM IST

ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుకెక్కిన డొనాల్డ్ ట్రంప్ బృందానికి చుక్కెదురైంది. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లో వీరు దాఖలు చేసిన దావాలను కోర్టులు కొట్టివేశాయి.

Trump campaign
డొనాల్డ్ ట్రంప్

మిషిగన్, జార్జియా ఎన్నికల్లో అవకతకవలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం వేసిన దావాలను అమెరికా కోర్టులు కొట్టివేశాయి. మిషిగన్​లో స్థానిక లెక్కింపు ప్రక్రియతో రాష్ట్ర కార్యదర్శికి సంబంధం లేదని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్.

జార్జియాలోనూ పిటిషనర్ల అభ్యర్థనను జడ్జి జేమ్స్ బాస్ తిరస్కరించారు.

ఐదు రాష్ట్రాల్లో..

మిషిగన్​లో ఆలస్యంగా వచ్చిన బ్యాలెట్లను లెక్కించవద్దని, జార్జియాలో సరిగా లేని బ్యాలెట్లను లెక్కిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్ బృందం పిటిషన్లు దాఖలు చేసింది. వీటితోపాటు పెన్సిల్వేనియా, నెవడా రాష్ట్రాల్లోనూ దావాలు వేశారు. విస్కాన్సిన్​లో ఓట్లను రీకౌంటింగ్​ చేయాలని డిమాండ్ చేశారు.

మిషిగన్, విస్కాన్సిన్​​లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ గెలుపొందారని అమెరికా వార్తా సంస్థలు ప్రకటించగా.. జార్జియాలో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇదీ చూడండి: 'బైడెన్​ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.