ETV Bharat / international

ట్రంప్​ కోసం 'ఆపరేషన్ మాగా'- జోరుగా ప్రచారం

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటం రిపబ్లికన్​ పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. అయితే ట్రంప్​ను మరోసారి అధ్యక్షుడ్ని చేయడమే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ 'ఆపరేషన్ మాగా' ప్రారంభించింది.

author img

By

Published : Oct 4, 2020, 12:27 PM IST

Trump campaign
ట్రంప్​ కోసం 'ఆపరేషన్ మాగా'- జోరుగా ప్రచారం

నవంబర్​ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. డొనాల్డ్ ట్రంప్ చూస్తే కరోనా బారిన పడి ఆసుపత్రిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రతిపక్ష డెమొక్రాట్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రచారంలో ట్రంప్ లేని లోటు కనబడకుండా ఉండేలా ఆయన తరఫున 'ఆపరేషన్ మాగా' మొదలు పెట్టింది.

పార్టీ అధికార ప్రతినిధులు, ప్రచార పక్షాలు, మద్దతుదారులతో పెద్ద ఎత్తున ట్రంప్​ తరఫున ప్రచారం నిర్వహించేదుకే ఈ 'ఆపరేషన్​ మాగా'ను సిద్ధం చేశారు. మాగా అంటే 'మేక్​ అమెరికా గ్రేట్ అగైన్​' అని అర్థం.

కీలక ప్రాంతాల్లో...

ఈ ప్రచార పర్వంలో భాగంగా కీలక ప్రాంతాల్లో ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ సహా ట్రంప్​ కుటుంబం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు.

"ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుటుంబం, మిత్ర పక్షాలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పూర్తి జోష్​లో ప్రచారం నిర్వహిస్తారు. డొనాల్డ్​ ట్రంప్​ ఒక్కరే ప్రచార బాధ్యతలు ఎలా అయితే భూజాల మీద వేసుకునేవారో అలా వీరంతా ప్రచారం చేస్తారు. ఆయన తిరిగి వచ్చే వరకు ఈ ఆపరేషన్ మాగా కొనసాగుతుంది."

- బిల్​ స్టెపిన్, ట్రంప్​ 2020 ప్రచార మేనేజర్

ఇందులో వర్చువల్​ ప్రచార కార్యక్రమాలు ఎక్కువ ఉన్నట్లు స్టెపిన్ తెలిపారు. అక్టోబర్​ 7న ఉపాధ్యక్ష డిబేట్​ జరగనుంది.

ఇప్పటికే ప్రకటించిన ట్రంప్​ ప్రచార కార్యక్రమాలను కొన్ని వర్చువల్​గా జరపనున్నారు. మరికొన్ని వాయిదా వేశారు.

ఫుల్​హౌస్...

ఇటీవల ట్రంప్​ నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో ఆయన అభిమానులు, మద్దతుదారులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఆరోగ్యశాఖ చెప్పిన నిబంధనలు గాలికి వదిలేసి, ఎక్కువ మంది మాస్కులు కూడా ధరించకపోవడంపై విమర్శలు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.