ETV Bharat / international

చమురు ఓడలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్

ఒమన్​ సమీపంలోని హొర్ముజ్​ జలసంధి వద్ద చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్ దేశమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.  ఇప్పటికే చమురు దాడికి అమెరికానే కారణమని హసన్ రౌహాని ఆరోపించారు. చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసిందని బ్రిటన్ అభిప్రాయపడింది.

చమురు ఓడలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్
author img

By

Published : Jun 15, 2019, 6:35 AM IST

Updated : Jun 15, 2019, 8:04 AM IST

చమురు ఓడలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్

చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్​ దేశమేనని ఆరోపించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రాముఖ్యమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసేందుకు యత్నిస్తోందన్న వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ జలసంధిని దిగ్బంధం చేయదని అభిప్రాయపడ్డారు.

అమెరికా ఆరోపణలను ఇరాన్ తిప్పికొట్టింది. ఇరాన్ ప్రధాని అయాతొల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో చర్చించేందుకు జపాన్ సుప్రిమో షింజో అబే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కారణంగానే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది ఇరాన్.

ఇరానే కారణం: బ్రిటన్

చమురు నౌకల దాడిపై అంచనాకు వచ్చినట్లు బ్రిటన్ వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరేమీ హంట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

"మా స్వతంత్ర అంచనా ప్రకారం చమురు నౌకలపై దాడికి బాధ్యత వహించాల్సింది ఇరాన్ మాత్రమే. ఇరాన్ దుడుకు స్వభావం ఈ ప్రాంతంలో అశాంతికి కారణమౌతుంది.​"

-బ్రిటన్ ప్రకటన

ఇదీ చూడండి: 'రష్యా వద్ద 'ఎస్​-400' కొనుగోలు వద్దు'

New Delhi, (India) 14 June (ANI): Girls from the Northeast, who will be representing their states in the upcoming 56th edition of Femina Miss India 2019 pageant to be held in Mumbai on June 15, are excited about it. FBB Colors Femina Miss India 2019 will be held on 15th June at Sardar Vallabhbhai Patel Indoor Stadium in Mumbai. Meet the 8 Northeast participants; Jyotishmita Baruah ,Miss India Assam, Marina Kiho, Miss India Nagaland, Sang Doma Tamang Femina Miss India Sikkim, Urmila Shagolsem Miss Femina Miss India Manipur, Jayanti Reang, Miss India Tripura, Roshni Dada , Miss India Arunachal Pradesh, Lalnunthari Rualhleng, Miss India Mizoram and Sangeeta Das Femina Miss India Meghalaya. The winner of Femina Miss India will represent India at Miss World 2019 in Thailand.
Last Updated : Jun 15, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.