ETV Bharat / international

వాషింగ్టన్​ అత్యున్నత కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్​!

author img

By

Published : Jun 26, 2020, 11:53 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్​లోని అత్యున్నత న్యాయస్థానంలో త్వరలోనే ఓ భారతీయ అమెరికన్​ న్యాయమూర్తిగా సేవలందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశాధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్.. విజయ్​ శంకర్​ పేరును నామినేట్​ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్​ ప్రస్తుతం న్యాయశాఖలోని క్రిమినల్​ విభాగంలో సీనియర్​ లిటిగేషన్​ కౌన్సిల్​గా విధులు నిర్వహిస్తున్నారు.

Trump announces intent to nominate Indian-American as judge to DC Court of Appeals
న్యాయమూర్తిగా ఎన్​ఆర్​ఐ పేరును సిఫార్సు చేసిన ట్రంప్​

భారతీయ అమెరికన్​ విజయ్​ శంకర్​ను వాషింగ్టన్​లోని అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా సిఫార్సు చేసే యోచనలో ఉన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్రంప్​ నిర్ణయానికి సెనేట్ ఆమోదం తెలిపితే.. కొలంబియా కోర్టులోని అప్పీల్స్​ విభాగంలో అసోసియేట్​ జడ్జిగా సేవలందించనున్నారు విజయ్​. ప్రస్తుతం ఆయన.. న్యాయశాఖలోని క్రిమినల్​ విభాగంలో సీనియర్​ లిటిగేషన్​ కౌన్సిల్​గా, అప్పీలేట్​ సెక్షన్​లో డిప్యూటీ చీఫ్​గా పని చేస్తున్నారు​.

'విజయ్​' ప్రస్థానం..

2012లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన విజయ్​​.. అంతకముందు వాషింగ్టన్​లో పలుచోట్ల ప్రైవేట్​ లాయర్​గా చేశారు. లా స్కూల్​ నుంచి గ్రాడ్యుయేషన్​ పొందాక 'స్టేట్​ కోర్ట్​ ఆఫ్​ అప్పీల్స్​ ఆన్​ ది సెకండ్​ సర్క్యూట్​'లో న్యాయమూర్తి చెస్టర్​ జే. స్ట్రాబ్​ వద్ద క్లర్క్​గా పని చేశారు.

ఉత్తర కరోలినాలో బీఏ పూర్తిచేసిన విజయ్​.. వర్జీనియా స్కూల్​ ఆఫ్​ లా యూనివర్శిటీ నుంచి జీడీ(జ్యూరిస్​ డాక్టర్​) పట్టాపొందారు. అక్కడే లా రివ్యూ కోసం ఎడిటర్​గా పనిచేస్తూనే, ఆర్డర్​ ఆఫ్​ కోయిఫ్​లో చేరారు.

ఇదీ చదవండి: జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.