అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించడాన్ని ఇకపై సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చాలా కాలంగా తమ దేశ ఉత్పత్తులపై భారత్ సుంకాలు పెంచుతూనే ఉందని ట్వీట్ చేశారు.
-
India has long had a field day putting Tariffs on American products. No longer acceptable!
— Donald J. Trump (@realDonaldTrump) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India has long had a field day putting Tariffs on American products. No longer acceptable!
— Donald J. Trump (@realDonaldTrump) July 9, 2019India has long had a field day putting Tariffs on American products. No longer acceptable!
— Donald J. Trump (@realDonaldTrump) July 9, 2019
జపాన్‌లో జీ-20 సదస్సు వేదికగా ట్రంప్- మోదీ కలిసిన కొద్ది రోజులకే అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ వ్యాఖ్యాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు ఇరు దేశాల ఆర్థిక మంత్రులతో సమావేశం కావాలని జీ-20 సదస్సులో ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సుంకాల పెంపు విషయంపై మోదీతో చర్చిస్తానని భేటీకి ముందే ట్వీట్ చేశారు ట్రంప్.
భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా సంస్థలకు భారత మార్కెట్లో అవకాశాలు, ఆ దేశ వస్తువులపై ఇటీవలి కాలంలో సుంకాల పెంపు వంటి అంశాలు వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
'భారత్ సుంకాల రారాజు...'
అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నందుకు భారత్‌ను 'సుంకాల రారాజు' అని గతంలోనే విమర్శించారు ట్రంప్.
బాదం, వాల్నట్ సహా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై ఇటీవలే సుంకాలను పెంచింది భారత్. ఉక్కు, అల్యూమినియం లాంటి భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: భారతీయుల కలల బిల్లుకు ఆమోదం నేడే!