ETV Bharat / international

భారతీయులు వెళ్లాలనుకునే టాప్‌ డెస్టినేషన్లు ఇవే!

అన్ని చోట్ల ప్రజలకు వ్యాక్సిన్‌ వేస్తుండటం వల్ల.. విహారయాత్రకు వెళ్లేందుకు భారతీయలు ఆసక్తి చూపిస్తున్నారని బుకింగ్​.కామ్​ అనే సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల్లో భారతీయులు గూగుల్‌లో వెతికిన హాలీడే ట్రిప్‌ డెస్టినేషన్‌ ప్రాంతాల ఆధారంగా టాప్‌ 10 అంతర్జాతీయ, దేశీయ డెస్టినేషన్‌ జాబితాలను విడుదల చేసింది. మరి ఆ జాబితాలో ఏయే ప్రాంతాలున్నాయంటే..?

indian travellers
భారతీయ పర్యటకుల ఆసక్తులు
author img

By

Published : Aug 5, 2021, 10:47 PM IST

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యలో లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. కరోనా కేసుల భయంతో బయటకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. మరోవైపు కొవిడ్‌ నిబంధనలు అమలవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి. అన్ని చోట్ల ప్రజలకు వ్యాక్సిన్‌ వేస్తుండటం వల్ల పర్యటకులను ఆహ్వానించేందుకు దేశాలు, రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎప్పుడు నిబంధనలు తొలగిస్తారా? ఎప్పుడు విహారయాత్రకు వెళ్లిపోదామా అని భారతీయులు తెగ ఎదురుచూస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈనెలలో గత ఐదు రోజుల్లో భారతీయులు గూగుల్‌లో వెతికిన హాలీడే ట్రిప్‌ డెస్టినేషన్‌ ప్రాంతాల ఆధారంగా బుకింగ్‌.కామ్‌ అనే సంస్థ టాప్‌ 10 అంతర్జాతీయ, దేశీయ డెస్టినేషన్‌ జాబితాలను విడుదల చేసింది. మరి ఆ జాబితాలో ఏయే ప్రాంతాలున్నాయో చూద్దాం..!

తొలి మూడు స్థానాల్లో..

విదేశీ విహారయాత్ర చేయాలనుకునేవారు ఎంచుకున్న దేశాల్లో యూఎస్‌ఏ, రష్యా, మాల్దీవులు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌, ఖతర్‌, కెనడా, యూకే, మెక్సికో, అర్మేనియా, ఫ్రాన్స్‌ దేశాలున్నాయి. ఈ దేశాల్లో చూడదగ్గ ప్రాంతాల గురించి భారతీయ పర్యటకులు గూగుల్‌లో ఎక్కువగా అన్వేషించారట. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే ఈ దేశాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.

మెట్రో సిటీల గురించి..

ఈ ఏడాది దేశీయ పర్యటక ప్రాంతాలను చూడాలని ఎక్కువ మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు బుకింగ్‌.కామ్‌ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని మెట్రో సిటీల గురించి, వాటికి దగ్గర్లో ఉండే పర్యటక ప్రాంతాల గురించి ఎక్కువగా గూగుల్‌ చేశారట. మొత్తంగా దేశీయ డెస్టినేషన్లలో తొలిస్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. రెండో స్థానంలో ముంబయి నగరం ఉండగా.. ముంబయికి సమీపంలో ఉండే లోనావాలా మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, జయపుర, హైదరాబాద్‌, లేహ్‌, ఉదయ్‌పుర్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: ప్రపంచంపై 'డెల్డా' పడగ- ఆ నగరంలో ఆరోసారి లాక్​డౌన్​

ఇదీ చూడండి: చైనాలో 'డెల్టా' విజృంభణ- ఎక్కడికక్కడ లాక్​డౌన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.