కరోనా మరోసారి విజృంభిస్తున్నా అమెరికన్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 'థాంక్స్ గివింగ్' సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను పెడిచెవిన పెట్టి ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కానీ, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య చాలా మేరకు తగ్గింది.
పెరిగిన విమాన ప్రయాణికులు..
'థాంక్స్ గివింగ్' సందర్భంగా విమాన ప్రయాణికులు తీవ్రంగా పెరిగారు. ఈ తరుణంలో జాతీయ విమానాశ్రయాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విమానాశ్రయాల్లో టెర్నినల్స్, రాపిడ్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరిన తర్వాత క్వారంటైన్లో ఉండేలా చర్యలు చేపడుతున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. దాదాపు 2,69,000 మంది మరణించారు. రోజుకు లక్ష 74 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ తరుణంలో ప్రజలు ప్రయాణాల వైపే మెుగ్గు చూపడం మరింత ప్రమాదకరంగా మారనుంది.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం- 40మంది మృతి