ETV Bharat / international

అద్దెకు 'బాల్కనీ'- గంటకు రూ.1800! - balcony

ఓ యువకుడు.. తన అపార్ట్​మెంట్​ బాల్కనీని అద్దెకు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఫొటోగ్రాఫర్లు, మోడల్స్​, ప్రజలు ఎగబడుతున్నారు. అతను ఉంటున్న భవనం నుంచి అద్భుతమైన నగర అందాలు కనపడతాయి. వాటిని బంధించేందుకు, అక్కడ ఫొటోలు దిగేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? ఆ ప్రదేశం ఏంటి? ఆ ఆలోచన ఎలా వచ్చింది?

toronto-guy-rents-his-balcony-for-clicking-pics
అద్భుత లొకేషన్​లో అద్దెకు 'బాల్కనీ'
author img

By

Published : Jul 4, 2021, 6:10 PM IST

సినిమాల్లో అద్భుతమైన లొకేషన్లు దర్శనమిస్తాయి. ఎత్తైన భవనాలు, వాటి వెనుక అందమైన బ్యాక్​గ్రౌండ్లు సర్వ సాధారణం. అవి చూస్తున్న ప్రతిసారీ.. అలాంటి ప్రాంతాల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలని మనకు కూడా అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లేసరికి ఫొటోల కోసం భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. అందుకు ప్రత్యామ్నాయాన్ని ఓ యువకుడు కనుగొన్నాడు. ఎత్తైన భవనం, కనుచూపు మేర కనపడే నగర అందాల మధ్య నివాసం ఉంటున్న అతను.. ఫొటోలు దిగేందుకు తన అపార్ట్​మెంట్​ బాల్కనీని అద్దెకు ఇస్తున్నాడు. అతని ఆలోచన ఇప్పుడు కాసులు కురిపిస్తోంది.

గంటకు 25 డాలర్లు...

టొరంటోలో నివాసముంటున్న 24ఏళ్ల ర్యాన్​ అల్రుషుద్​.. ఓ అపార్ట్​మెంట్​లోని 60వ అంతస్తులో నివాసముంటున్నాడు. అంత ఎత్తైన భవనం నుంచి నగరం మొత్తం అత్యంత సుందరంగా కనపడుతుంది. అతనికి ఓ అలోచన వచ్చింది. ఇక తన అపార్ట్​మెంట్​ బాల్కనీని అద్దెకు పెట్టేశాడు​. ఫొటో ప్రేమికులకు ఇది హాట్​స్పాట్​గా మారిపోయింది. ర్యాన్​ బాల్కనీని ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు దిగుతున్నారు ప్రజలు. అవి సామాజిక మాధ్యమాల్లో మంచి లైక్స్​ తెచ్చిపెడుతున్నాయి.

తన బాల్కనీని ఫొటోలు దిగేందుకు మోడల్స్​కు, ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లకు అందుబాటులో ఉంచాడు ర్యాన్​. మనిషికి గంటకు 25డాలర్లు వసూలు చేస్తున్నాడు. బాల్కనీతో పాటు బాత్​రూం, వైఫై​ అదనంగా ఇస్తున్నాడు. ఒక్కసారి కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుంది.

స్వతహాగా ఫొటోగ్రాఫర్​ అయిన ర్యాన్​.. తన లాంటి ఫొటోగ్రాఫర్ల కోసం ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు చెప్పాడు. టొరంటోలోని స్టూడియోల కన్నా తాను వసూలు చేస్తున్న డబ్బులు చాలా తక్కువని తెలిపాడు.

"టొరంటోలోని స్టూడియోలు ఖరీదైనవి. అందువల్ల నా లాంటి ఫొటోగ్రాఫర్లకు నా బాల్కనీని చౌకగా ఇస్తున్నాను. ఫొటోగ్రాఫర్లు, మోడల్స్​ దీనిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను."

-ర్యాన్​ ఆల్రుషూద్​, టొరంటో

ర్యాన్​ ఆఫర్​ నచ్చి ప్రజలు ఎగబడుతున్నారు. అంత ఎత్తులో, సుందరమైన బ్యాక్​గ్రౌండ్​లో ఫొటోలు దిగేందుకు ఇష్టపడి బుకింగ్స్​ చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:- అంతరిక్షం అంచుకు వెళ్లాలా? ఎంత ఖర్చవుతుందంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.