ETV Bharat / international

అమెరికాలో టోర్నడో బీభత్సం- ముగ్గురు మృతి - నార్త్​ కరోలినాలో టోర్నడో

అమెరికాలోని ఉత్తర కరోలినాలో సోమవారం అర్ధరాత్రి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 10మందికి గాయాలయ్యాయి. గాలి తాకిడికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.

Tornado levels homes in North Carolina; 3 dead, 10 injured
ఉత్తర కరోలినాలో టోర్నడో బీభత్సం-ముగ్గురు మృతి
author img

By

Published : Feb 17, 2021, 11:35 AM IST

ఉత్తర కరోలినాలో టోర్నడో బీభత్సం-ముగ్గురు మృతి

అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రం ఓషియన్​ బ్రిడ్జ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి సుడిగాలి సంభవించింది. గాలుల ధాటికి ముగ్గురు మరణించగా, 10 మందికి గాయాలయ్యాయి. అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కార్లు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగిపడ్డాయి. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే సుడిగాలి ఇంతటి విధ్వంసం సృష్టించిందని స్థానికులు వివరించారు.

సుడిగాలిపై ముందస్తు సమాచారం రాలేదని బ్రన్స్​విక్​ కౌంటీ అత్యవసర సేవల విభాగం డెరక్టర్ ఎడ్ కాన్రో చెప్పారు. రాత్రి వేళ ఒక్కసారిగా గంటకు 257 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : పెట్​ స్టోర్​లో అగ్నిప్రమాదం-100 జంతువులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.