ETV Bharat / international

గల్వాన్​ ఘటనపై భారత్​కు మద్దతుగా అమెరికా సెనేటర్లు - గల్వాన్​

సరిహద్దులో గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్​కే మద్దతుగా నిలుస్తున్నారు. చైనా దురాక్రమణపై.. అమెరికా అగ్రశ్రేణి సెనేటర్‌ మార్కో రూబియో, మెజారిటీ లీడర్​ మెక్​కన్నెల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఆగ్రహపూరిత వైఖరి అవలంబిస్తోందన్నారు మరో సెనేటర్​ కాటన్​.

Top US senators slam China's 'unwarranted armed' aggression against India
గల్వాన్​ ఘటనపై భారత్​కు మద్దతుగా అమెరికా సెనేటర్లు
author img

By

Published : Jun 30, 2020, 12:42 PM IST

గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు. తాజాగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సెనేటర్‌ మార్కో రూబియో.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సంధూతో మాట్లాడారు. భారత ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని ట్వీట్​ చేశారు. చైనా కుట్రలను తిప్పికొట్టే సత్తా భారత్‌కు ఉందని‌ గల్వాన్‌ ఘర్షణలో స్పష్టం అయిందన్నారు.

సెనేటర్‌ మెజారిటీ లీడర్‌ మిచ్‌ మెక్‌కన్నెల్‌ సెనేట్‌లో మాట్లాడుతూ.. భారత్‌ పట్ల చైనా దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోందని సభకు వివరించారు. జపాన్‌ అధీనంలో ఉండే సముద్ర జలాలతో పాటు భారత సరిహద్దుల్లో చైనా ఆగ్రహపూరిత వైఖరి అవలంబిస్తోందని మరో సెనేటర్‌ టామ్‌ కాటన్‌ స్పష్టం చేశారు.

ఉద్రిక్తతలు..

భారత్​-చైనా మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్​ 15న అర్ధరాత్రి.. తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో సోమవారం భారత్​-చైనా సైనికులు మధ్య భీకర ఘర్షణ జరిగింది. చైనా దుస్సాహసానికి 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. అటువైపు కూడా భారీగానే ప్రాణనష్టం జరిగిందని భావిస్తున్నారు. అనంతరం.. పలు దఫాల్లో భారత్​,చైనా సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిపాయి. ఇవాళ కూడా చుషుల్​లో సమావేశమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.