ETV Bharat / international

రూ.లక్షన్నరతో రెండేళ్ల పిల్లాడి షాపింగ్- అమ్మ ఫోన్​తో ఆడుకుంటూ... - ప్రమోద్ కుమార్ మధు ఫర్నిచర్ ఆర్డర్

Toddler shopping with moms phone: గేమ్స్​ ఆడుకుంటాడని చిన్న పిల్లాడికి స్మార్ట్​ఫోన్​ ఇచ్చిన ఆ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఆ బాలుడు ఏకంగా 1700 డాలర్లు విలువైన ఫర్నిచర్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ చేశాడు.

Toddler shopping with moms phone
Toddler shopping with moms phone
author img

By

Published : Jan 24, 2022, 2:14 PM IST

Toddler shopping with moms phone: వీడియో గేమ్స్​ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్​ఫోన్​ తీసుకున్న ఓ 22 నెలల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ చేశాడు. న్యూజెర్సీలో జరిగిందీ ఘటన.

కొత్త ఇల్లు.. కొత్త సామాను...

ప్రమోద్​ కుమార్​-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. గృహప్రవేశం కూడా అయింది. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని అనుకుంది మధు. వాల్​మార్ట్​ యాప్​లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్​లో యాడ్ చేసింది. అయితే.. అన్నీ ఆలోచించుకుని నెమ్మదిగా ఆర్డర్​ చేద్దామని అనుకుంది మధు.

Toddler shopping furniture:

అనూహ్యంగా వాల్​మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఒకటి, రెండు, మూడు.. అలా వరుసగా డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఏంటా అని యాప్​ చూసిన ప్రమోద్-మధుకు అసలు విషయం బోధపడింది. ఇదంతా తమ కుమారుడైన 22 నెలల అయాన్ష్​ చేసిన పనేనని అర్థమైంది.

Toddler shopping with moms phone
అయాన్ష్

Toddler shopping walmart

"అయాన్ష్​ యాప్​ ఓపెన్ చేశాడు. కార్ట్​లో యాడ్​ చేసి ఉన్నవాటన్నింటినీ ఆర్డర్ చేశాడు. పేమెంట్స్​ అన్నీ పూర్తయిపోయాయి. ముందు ఓ వ్యక్తి ఓ పెట్టె తీసుకువచ్చాడు. ఆ వెంటనే మరొకరు. తర్వాత ఇంకొకరు. ఆర్డర్​ చేసిన వాటిలో 75శాతం వస్తువులు ఇప్పటికే డెలివర్ అయిపోయాయి" అని చెప్పాడు ప్రమోద్.

Toddler shopping with moms phone
ఇంటికి వచ్చిన ఫర్నిచర్

"అందరూ ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలోనే ఉంటున్నారు. అయాన్ష్ తోబుట్టువులు కూడా ఎప్పుడూ ఫోన్​తోనే గడుపుతారు. అందుకే అతడికీ ఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ.. ఇకపై ఫోన్​కు పాస్​వర్డ్​ పెట్టాలని, క్రెడిట్ కార్డ్ సమాచారం లేకుండా చూడాలని ఈ ఘటనతో నాకు అర్థమైంది" అని అంటున్నాడు ప్రమోద్.

అందుకు ఒప్పుకున్న వాల్​మార్ట్

అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందంటూ వాల్​మార్ట్​ను సంప్రదించారు ప్రమోద్-మధు. వారి అభ్యర్థన పట్ల వాల్​మార్ట్ సానుకూలంగా స్పందించింది. అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.

ఇదీ చదవండి: యంగ్​గా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ- కళ్లు మూయలేకపోతున్న వృద్ధుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.