ETV Bharat / international

అయోధ్యలో భూమిపూజ రోజు న్యూయార్క్​లో కోలాహలం - ram temple news

అయోధ్యలో ఆగస్టు 5న భూమిపూజ నిర్వహించి రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ చారిత్రక కార్యక్రమం సందర్భంగా అమెరికా న్యూయార్క్​లోని ప్రఖ్యాత టైమ్స్​ స్క్వేర్స్​లో శ్రీరాముని ఫొటోలు, 3డీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు భారత అమెరికన్​ ప్రజా వ్యవహారాల కమిటీ తెలిపింది.

Times Square to display Lord Rama's portraits during Ayodhya event
అయోధ్యలో భూమిపూజ రోజు న్యూయార్క్​లో కోలాహలం
author img

By

Published : Jul 30, 2020, 5:21 PM IST

ఆగస్టు 5న అమెరికా న్యూయార్క్​లోని ప్రఖ్యాత టైమ్స్​ స్క్వేర్వ్​లో శ్రీరాముని చిత్రాల ప్రదర్శనతో సందడి చేయనున్నారు భారతీయులు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతున్న సందర్బంగా భారీ స్థాయిలో ఉత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు భారత అమెరికన్​ ప్రజా వ్యవహారాల కమిటీ తెలిపింది.

అతిపెద్ద తెరపై

టైమ్స్​ స్క్వేర్స్​లోని నాస్డాక్ స్క్రీన్​ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ స్క్రీన్​తో పాటు 17వేల అడుగుల చదరపు అడుగుల ఎల్​ఈడీ తెరపై శ్రీరాముని ఫొటోలు, త్రీడీ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

రామమందిర భూమిపూజ కార్యక్రమం చారిత్రకమని.. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత అమెరికన్​ ప్రజా వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెవ్హానీ తెలిపారు. ఆ రోజు టైమ్స్​ స్క్వేర్స్​లో భారతీయులు భారీ సంఖ్యలో గుమిగూడి మిఠాయిలు పంచి వేడుక చేసుకోనున్నట్లు చెప్పారు.

'ఆగస్టు 5న ఉదయం 8 నుంచి రాత్రి 10గంటల వరకు శ్రీరాముని ఫొటోలు, వీడియోలు, త్రీడీ చిత్రాలు, రామమందిరం నమూనా, భూమిపూజలో మోదీ పాల్గొన్న దృశ్యాలను టెమ్స్​ స్క్వేర్స్​ సహా ఇతర బిల్​బోర్డులలో ప్రదర్శిస్తాం' అని జగదీశ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్​-చైనాకు ఆ విషయం పట్టదు: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.