ETV Bharat / international

ట్రంప్​ నిర్ణయంపై టిక్​టాక్​ న్యాయపోరాటం

author img

By

Published : Aug 23, 2020, 2:59 PM IST

అమెరికాలో టిక్​టాక్​ను నిషేధించేందుకు ట్రంప్​ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కోర్టులోనే అడ్డుకుంటామని స్పష్టం చేసింది ఆ సంస్థ. త్వరలోనే కోర్టులో దావా వేయనున్నట్లు ప్రకటించింది. వేరేదారి లేకనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించింది.

TikTok to file lawsuit
అమెరికా నిర్ణయంపై ఇక కోర్టుకే..! టిక్‌టాక్‌

టిక్‌టాక్‌ యాప్‌ను అమెరికాలో నిషేధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇక కోర్టులోనే అడ్డుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ట్రంప్‌ నిర్ణయాలను సవాలు చేస్తూ త్వరలోనే దావా వేయనున్నట్లు ప్రకటించింది.

" టిక్‌టాక్‌ విషయంలో మా స్పందనను వినేందుకు అమెరికా ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ సమయంలో చట్టాన్ని అతిక్రమించలేదని, మా సంస్థతోపాటు వినియోగదారులు చట్టబద్ధంగా నడుచుకున్నామని నిరూపించుకోవడానికి మాకున్న ఏకైక మార్గం న్యాయవ్యవస్థనే. అందుకే ట్రంప్‌ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ వారం రోజుల్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం."

- జోష్​ గార్ట్నర్​, టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి

టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులను అమెరికా సంస్థలకు బదిలీ చేయకపోతే నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికోసం తొలుత 45రోజుల గడువు ఇచ్చినప్పటికీ అనంతరం 90రోజులకు పొడగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం అన్ని దారులు మూసుకుపోయినట్లు టిక్‌టాక్‌ అభిప్రాయపడింది.

పలు సంస్థల ఆసక్తి..

టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సామాజిక మాధ్యమ దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటికే ఈ యాప్‌పై నిషేధం ఉన్న భారత్‌లో దీన్ని సొంతం చేసుకునేందుకు రిలయన్స్‌ కూడా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: ట్రంప్‌ నిషేధించినా ఆ వెబ్‌సైట్‌ నడిపిస్తాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.