ETV Bharat / international

అమెరికాలో టిక్​టాక్​కు మరోమారు ఊరట- నిషేధం వాయిదా - అమెరికాలో టిక్​టాక్ నిషేధం వాయిదా

చైనా యాప్​ టిక్​టాక్​ యాజమాన్యానికి అమెరికా కోర్టులో స్వల్ప ఊరట లభించింది. నవంబర్​ 12 నుంచి అమలు కావాల్సిన పూర్తిస్థాయి నిషేధాన్ని వాయిదా వేశారు పెన్సిల్వేనియా ఫెడరల్​ జడ్జి. అయితే.. ఈసారి టిక్​టాక్​ సంస్థ కాకుండా ముగ్గురు వినియోగదారులు వేసిన పిటిషన్​పై ఈ మేరకు ఆదేశాలు రావటం గమనార్హం.

TikTok
అమెరికాలో టిక్​టాక్​కు మరోమారు ఊరట
author img

By

Published : Oct 31, 2020, 11:57 AM IST

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ యాజమాన్యానికి అమెరికాలో మరోమారు ఊరట లభించింది. తమ హక్కులను అమెరికా కంపెనీలకు బదిలీ చేయకుంటే నవంబర్​ నుంచి పూర్తిస్థాయిలో నిషేధం ఉంటుందన్న అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆదేశాలను వాయిదా వేశారు పెన్సిల్వేనియా కోర్టు ఫెడరల్​ న్యాయమూర్తి. ట్రంప్​ నిర్ణయం తమ స్వేచ్ఛా సంభాషణలకు ఆటంకం కలిగిస్తోందని పెన్సిల్వేనియాకు చెందిన హాస్యనటుడు సహా మరో ఇద్దరు టిక్​టాక్​ వినియోగదారులు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

పెన్సిల్వేనియాకు చెందిన హాస్యనటుడు డగ్లస్​ మార్లాండ్​, దక్షిణ కాలిఫోర్నియా ఫ్యాషన్​ డిజైనర్​ కోసేట్​ రినాబ్​, సంగీతకారుడు అలెక్​ ఛాంబర్స్​లు.. కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్​పై విచారణ చేపట్టారు జిల్లా న్యాయమూర్తి వెండి బీటిల్​స్టోన్​. కీలక సాంకేతిక సేవలను నిలిపివేస్తూ.. అమెరికాలో టిక్​టాక్​ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు వాణిజ్య విభాగం త్వరలోనే తీసుకోబోయే చర్యలను అడ్డుకున్నారు.

"అధ్యక్షుడు తన అధికారాలను మించి విధించిన ఈ నిషేధాన్ని న్యాయమూర్తి నిలిపివేసినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ చర్య స్వేచ్ఛా సంభాషణకు మన దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది."

- పిటిషనర్ల తరఫు న్యాయవాది

చైనాకు చెందిన సంస్థ కాబట్టి టిక్​టాక్​తో తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉందని, తమ వినియోగదారులపై చైనా గూఢచర్యం చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ట్రంప్​ పరిపాలన విభాగం. సెప్టెంబర్​ 27న జారీ చేసిన ట్రంప్​ కార్యనిర్వాహక ఆదేశాల ప్రకారం.. నవంబర్​ 12 నుంచి పూర్తిస్థాయిలో నిషేధం అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. తాజాగా ఫెడరల్​ జడ్జి ఆదేశాలతో వాయిదా పడింది. ట్రంప్​ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు రావటం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్​లో స్మార్ట్​ ఫోన్​ యాప్​ స్టోర్స్​ నుంచి టిట్​టాక్​ను నిషేధించే ఆదేశాలను మరో ఫెడరల్​ జడ్జి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధం ఎన్నికల జిమ్మిక్కు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.