అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా భారీగా నిరసనలు చేపట్టారు ఆయన అభిమానులు. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలిచిన వారం రోజుల తర్వాత దేశ రాజధానిలో సమావేశమైన ట్రంప్ మద్దతుదారులు... ఫలితాలను నిరసిస్తూ, ఓట్లు దొంగిలించారని ఆరోపణలు చేశారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.



ఈ నేపథ్యంలో శ్వేతసౌధం ముందు భారీఎత్తున ట్రంప్ అభిమానులు వాహనాలతో వచ్చిగుమిగూడారు. వర్జీనియా గోల్ఫ్ క్లబ్‌కి వెళ్లే దారిలో ట్రంప్ మద్దతుదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు. ట్రంప్ వాహనానికి దగ్గరిగా వెళ్లిన మద్దతుదారులు... సమీప వీధికి ఇరువైపులా నిల్చున్నారు. ఆయనకి ఉత్సాహంగా అభివాదం చేశారు.
ఇదీ చూడండి: ఈజిప్ట్‌లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు