మెక్సికోలోని ఆబుకెర్కీ నగరంలో 'క్యాన్ వెన్సన్' నిర్వహిస్తున్నారు. వందల కొద్దీ బీరు అభిమానులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బ్రేవరీ కలెక్షన్ క్లబ్ ఆఫ్ అమెరికా 49వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీరు ఫ్యాక్టరీని తలపించే ఈ ప్రదేశంలో రకరకాల ప్రముఖ బ్రాండ్ బీరు రుచులను చూడచ్చు.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కొంత మంది ఔత్సాహికులు ఇక్కడ ఖాళీ బీరు సీసాలను కొనుగోలు చెయ్యడం, అమ్మడం వంటివి చేస్తుంటారు. వాటి ధర 100 డాలర్ల వరకు ఉంటుంది. ఒక్కోసారి అది వేలల్లో కూడా పలుకుతుంది.