ETV Bharat / international

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​​ ముందున్న సవాళ్లు - challenges before america new president

అమెరికా అధ్యక్షునిపై గతంలో ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం కరోనా సంక్షోభం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని చేపట్టడం ఎవరికైనా సవాలే. అయితే తన వద్ద పక్కా ప్రణాళికలున్నాయని జో బైడెన్​ ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే శక్తి బైడెన్​కు ఉందా? ట్రంప్​ చేయలేనివి బైడెన్​ చేయగలరా? బ్లూ, రెడ్‌ స్టేట్స్‌ అన్న వైరుధ్యాల్ని తోసిపుచ్చి 'యునైటెడ్‌ స్టేట్స్‌'గా అమెరికాను కదం తొక్కించగలరా?

these-are-the-challenges-for-biden-as-president
అమెరికా అధ్యక్షునిగా జో బైెడెన్​ ముందున్న సవాళ్లు
author img

By

Published : Jan 20, 2021, 11:45 PM IST

అమెరికా గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు జో బైడెన్​. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం ప్రస్తుతం ఆయన ముందున్న ప్రధాన సవాల్​. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అమెరికాను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడం, జాతివివక్షకు తావు లేకుండా అగ్రరాజ్యంలో విభజన వాదాన్ని రూపుమాపడం ఆయన ఎదుర్కోబోయే ఇతర కఠిన సవాళ్లు.

కరోనా కారణంగా ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. ఇప్పటి వరకు ఆ దేశంలో 2కోట్ల 46లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. ఏకంగా 4లక్షలమందికిపైగా మహమ్మారికి బలయ్యారు. బైడెన్​ తొలుత కరోనా కట్టడిపైనే దృష్టిసారించనున్నారు. బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే 10కోట్ల మందికి టీకాలు అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం నయా ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రజారోగ్య సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. మాస్కు తప్పనిసరి చేయడం, టెస్టింగ్​, కాంటాక్ట్​ ట్రేసింగ్​ను పెంచడం, కొవిడ్​-19 కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు​.

1.9 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజ్​..

కరోనా వైరస్ నియంత్రణకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను బైడెన్​ ఇప్పటికే ఆవిష్కరించారు. మహమ్మారి నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం సహా, దీర్ఘకాలిక ఆర్థిక పతనంతో పోరాడుతున్న వ్యక్తులు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు, వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ప్యాకేజ్​ ప్రణాళికను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అమెరికన్లకు 1400 డాలర్ల ఆర్థిక సాయాన్ని నేరుగా అందిచనున్నట్లు ప్రకటించారు. కనీస జాతీయ వేతనాన్ని 15డాలర్లుగా ప్రతిపాదించారు.

విభజనను రూపు మాపాలి..

అగ్రరాజ్యంలో వర్ణ విబేధాలు తారస్థాయికి చేరాయి. నల్ల జాతీయులు, తెల్లజాతీయులు అనే తారతమ్యం గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రబలుతోంది. ట్రంప్​ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయితే ఈ పరిస్థితి ఉంటే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని బైడెన్​ ఇప్పటికే చెప్పారు. ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని ప్రమాణ స్వీకారోత్సవానికి థీమ్​గా 'యునైటెడ్​ అమెరికా'ను ఎంచుకున్నారు. అమెరికా ఐకమత్యంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.

ట్రంప్​ నిర్ణయాలతో అప్రతిష్ఠ..

నాలుగేళ్లు అధికారంలో ఉన్న ట్రంప్​ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమెరికాపై ప్రంపంచ దేశాలకు ఉన్న అభిప్రాయాలను మారేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. పారిస్​ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్​తో అణు ఒప్పందం రద్దు చేసుకోవడం, కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు రావడం వంటి ట్రంప్​ నిర్ణయాలను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించడమే కాక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి క్యాపిటల్​ భవనంలో హింసాకాండకు కారణమయ్యారు​. ఆయన తీరుతో అమెరికా ప్రతిష్ఠ మసకబారినట్లయింది.

అయితే పారిస్​ ఒప్పందంలో తిరిగి చేరడమే కాకుండా, ఇరాన్​పై ఆంక్షలు ఎత్తివేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థతో మళ్లీ కలిసి పనిచేస్తామని బైడెన్​ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికాకు తిరిగి పెద్దన్న పాత్రలో నిలబెట్టనున్నారు.

అంత సులభమేం కాదు..

అమెరికా అధ్యక్షునిగా బైడెన్​ ఎదుర్కోబోయే సవాళ్లు అంత సులభమైనవేమి కాదని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు సర్వ శక్తులు ఒడ్డేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. తమ లక్ష్యాలను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తామని, కాంగ్రెస్ సభ్యులు సహకారం, మద్దతు ఉంటే అనుకున్నది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అధ్యక్షుడిగా ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.