ETV Bharat / international

'ఒక్క అమెరికా వల్ల కాదు- భారత్ సాయం కావాలి'

అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను అమెరికా ఒంటరిగా ఎదుర్కోలేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ పేర్కొన్నారు. ఇందుకోసం భారత్ సాయం కావాలని అన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం రాజకీయ పార్టీలకు అతీతమని, ఈ బంధం దశాబ్దాల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ortagus
ఓర్టాగస్
author img

By

Published : Oct 29, 2020, 5:48 AM IST

ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయి గణనీయంగా పురోగమించిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ సాయం అవసరమని నొక్కిచెప్పారు. భారత్- అమెరికా మధ్య సంబంధాలు రాజకీయ పార్టీలకు అతీతమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా భారత్​తో సంబంధాలకు ఢోకా లేదన్నారు.

  • #WATCH: ...We welcome the fact that India is now such an important global player. There are many global challenges that the US faces, we cannot face them alone. We need India, we need the partnership...: Morgan Ortagus, US State Department Spokesperson, in Washington pic.twitter.com/9ZezKVTMH8

    — ANI (@ANI) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి ఎస్పర్​లు టూ ప్లస్ టూ చర్చల కోసం భారత్​కు వెళ్లడం చాలా ముఖ్యమైన విషయం. సుదీర్ఘ కాలంగా భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొనసాగుతూ వస్తోంది. ఈ సంబంధాలు దశాబ్దాల పాటు, ఇంకా మరింత కాలం ఇలాగే ఉంటాయి. ఈ బంధం రాజకీయ పార్టీలకు అతీతం. ఇరుదేశాలను విలువలే ఒక్కటిగా కలుపుతున్నాయి.

భారత్​ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న వాస్తవాన్ని మేం స్వాగతిస్తున్నాం. చైనా సమస్యతో పాటు అంతర్జాతీయంగా అమెరికా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. వాటిని ఒంటరిగా ఎదుర్కోలేం. మాకు భారత్​ కావాలి. మాకు ఈ భాగస్వామ్యం అవసరం."

-మోర్గాన్ ఓర్టాగస్, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

మరోవైపు చైనా లక్ష్యంగా విమర్శలు సంధించారు మోర్గాన్. కొవిడ్ ఉద్భవంపై దర్యాప్తు చేపట్టేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలను అనుమతించాలని చైనాను డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఉండాలని హితవు పలికారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.