ETV Bharat / international

Covid Vaccine: 'ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం'

ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్​-19 (Covid-19 Vaccine) టీకాలను కేటాయించనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించగా.. తాజా ప్రకటనతో ఆ మొత్తం 8 కోట్ల డోసులకు చేరుతుంది.

united-states
అమెరికా
author img

By

Published : Jun 22, 2021, 7:26 AM IST

ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్​-19 టీకాలను (Covid-19 Vaccine) కేటాయించనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్​, బంగ్లాదేశ్​ వంటి ఆసియా దేశాలకు 1.6 కోట్ల డోసులను ఇస్తామని తెలిపింది. అమెరికాలోని జో బైడెన్​ సర్కారు ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది. తాజా ప్రకటనతో ఆ కేటాయింపు 8 కోట్ల డోసులకు చేరుతుంది.

"స్వదేశంలో ఈ మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ముగింపు పలికేందుకు కృషి చేస్తాం. ప్రపంచానికి 'టీకాల ఆయుధాగారం'గా అమెరికాను మారుస్తామని బైడెన్​ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా దేశీయ సరఫరా నుంచి వ్యాక్సిన్లను విరాళంగా ఇస్తాం. ఈ నెల చివరి నాటికి 8 కోట్ల డోసులను కేటాయించాలని బైడెన్​ హామీ ఇచ్చారు." అని అమెరికా అధ్యక్ష భవనం' వైట్​ హౌస్​' పేర్కొంది. ఈ టీకాల్లో(Covid-19 Vaccine) 75 శాతాన్ని 'కొవాక్స్​' కింద అందించనున్నట్లు తెలిపింది.

వ్యాక్సిన్​ ఉత్పత్తి పెంపు..

ప్రపంచవ్యాప్తంగా టీకా కవరేజీని పెంచడమే తమ ఉద్దేశమని వివరించింది. తద్వారా కేసుల సంఖ్య పెరగకుండా చూడాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించింది. ఇతర దేశాల నుంచి ప్రయోజనాలను పొందేందుకు ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉపయోగించుకోబోమని పేర్కొంది. ప్రపంచ దేశాలకు అందించడానికి వీలుగా వ్యాక్సిన్​ ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా తయారీదారులతో కలిసి కసరత్తు సాగించనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: Iran New President: 'బైడెన్​ను కలవడమా.. అసలు ఒప్పుకోను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.