ETV Bharat / international

'భారత్​లో పరిస్థితి చూసి హృదయం ముక్కలైంది' - కరోనా కేసులు భారత్​లో

భారత్​లో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటం హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తుచేసుకున్నారు.

kamala harris
కమలా హారిస్
author img

By

Published : May 7, 2021, 10:03 PM IST

Updated : May 7, 2021, 10:36 PM IST

భారత్​లో కొవిడ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవటం.. హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు.

భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు తాము మద్దతిచ్చామన్నారు కమల. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తు చేసుకున్నారు.

మూలాలు భారత్​లోనే..

తన వంశం మూలాలు భారత్​లోనే ఉన్నాయని కమల అన్నారు. తన తల్లి భారత్​లోనే పుట్టి, పెరిగారని తెలిపారు.. అమెరికాకు భారత్ సంక్షేమం అత్యంత ముఖ్యమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్​కు సాయ పడేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

" మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకారం అందించింది. ప్రస్తుతం మేము భారత్​కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్​ మాకు మంచి నేస్తం. అందుకే సాయం చేస్తున్నాం. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే.. మహమ్మారిని అంతం చేయొచ్చు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించాం. భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు మద్దతిచ్చాం."

-- కమాలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు

గడిచిన వారం రోజుల్లోనే బైడెన్ ప్రభుత్వం.. భారత్​కు 100 మిలియన్ డాలర్ల సాయం చేసిందన్నారు హారిస్​.

ఇదీ చదవండి : ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మృగరాజుకు కరోనా

Last Updated : May 7, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.