అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలనైప్పటికీ డొనాల్ట్ ట్రంప్ తీరు మాత్రం మారడం లేదు. ఇంకా తానే గెలిచానని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పరిశీలకులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేలేదని ఆరోపిస్తున్నారు.
" 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు సాధించాను. అమెరికా చరిత్రలో మరే ఇతర సిట్టింగ్ అధ్యక్షుడికి ఇన్ని ఓట్లు రాలేదు. నేనె గెలిచాను. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పరీశీలకులను అనుమతించలేదు. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. లక్షలాది మందికి బ్యాలెట్ ఓట్లను అడగకుండానే పంపారు."
- డొనాల్డ్ ట్రంప్ ట్వీట్