ETV Bharat / international

అమెరికా తలరాతను తేల్చేవి ఇవే...

author img

By

Published : Nov 2, 2020, 9:03 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజే మిగిలి ఉంది. ప్రజలు వేటి ఆధారంగా తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధనా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ట్రంప్‌, బైడెన్‌ల భవితవ్యాన్ని తేల్చే అంశాలపై నివేదకి రూపొందించాయి.

US_POLLS
అమెరికా తలరాత తేల్చేవి ఇవే...

ట్రంపా, బైడెనా... ఎవరు కొత్త అధ్యక్షుడనేది మంగళవారం తేల్చుకోబోతున్న అమెరికా ప్రజానీకం ఇంతకూ వేటి ఆధారంగా తన నిర్ణయాన్ని తెలుపుతోంది? అమెరికా ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? ట్రంప్‌, బైడెన్‌ల భవితవ్యాన్ని తేల్చే అంశాలు ఏంటంటే...

ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రజల ప్రాధాన్యం ఇలా ఉంది!

US_POLLS
సర్వేల ఆధారంగా

ఆర్థిక వ్యవస్థ

కరోనా మహమ్మారి విరుచుకుపడేవరకూ దేశ ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ బాగానే నిర్వహించారు. నిజానికి మునుపటి ఒబామా ప్రభుత్వం నుంచి ట్రంప్‌ చేతికి ఆర్థిక వ్యవస్థ బదిలీ అయ్యేనాటికే అది చక్కగా ఉంది. ఈ ఏడాది కొవిడ్‌ విజృంభణతో అమెరికాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థిక అంశం.. ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించనుంది. ఈ ఏడాది వరుసగా రెండు త్రైమాసికాల్లోనూ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారీ తగ్గుదల నమోదైంది. రెండో త్రైమాసికంలో 9.1 శాతం క్షీణత చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో ఎన్నడూ ఒక త్రైమాసికంలో 3 శాతం కన్నా ఎక్కువగా జీడీపీ పడిపోయిన దాఖలాలు లేవు. భారీ ఉద్దీపనలతో ట్రంప్‌ దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు.

US_POLLS
ఆర్థిక వ్యవస్థ

ఆరోగ్య పరిరక్షణ

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ అనేది ఈ దఫా ఎన్నికల అంశాల్లో కీలకంగా నిలిచింది. అయితే ఈ అంశంలో ట్రంప్‌ పనితీరు పేలవంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒబామా తెచ్చిన 'అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్‌' (ఒబామా కేర్‌) చుట్టూ చర్చ నడుస్తోంది. దీని రద్దుకు ట్రంప్‌ సర్కారు ప్రయత్నిస్తోంది. డెమొక్రాట్లు దీన్ని తప్పుబడుతున్నారు. ఒబామా కేర్‌ను రద్దు చేస్తే గుండె జబ్బులు, మధుమేహం వంటి రుగ్మతలున్నవారికి ఆరోగ్య బీమా, ఆరోగ్య పరిరక్షణ సేవల లభ్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. వైద్య సాయానికి ఇచ్చే ఫెడరల్‌ నిధులపై పరిమితిని కూడా ట్రంప్‌ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఒబామా కేర్‌ భవితవ్యంపై చాలామందిలో ఆందోళన నెలకొంది.

US_POLLS
ఆరోగ్య పరిరక్షణ

మరోవైపు ఈ పథకాన్ని బలోపేతం చేస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. ప్రైవేటు బీమా కంపెనీలతో పోటీపడే మెడికేర్‌ తరహా వెసులుబాటునూ దీనికి జోడిస్తామన్నారు. పనిచేసే వయసులో ఉన్న అందరికీ దీన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఔషధాల ధరలనూ తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్‌ 2016 నాటి హామీలనే తిరిగి ఇస్తున్నారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామని, ఔషధాల ధరలను తగ్గిస్తామని చెప్పారు.

కొవిడ్‌-19 మహమ్మారి

కరోనాను ట్రంప్‌ ఎదుర్కొన్న తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీన్ని బైడెన్‌ తన ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. తొలుత కొవిడ్‌ను ట్రంప్‌ తేలిగ్గా తీసుకున్నారు. స్వయంగా మాస్కు ధరించడానికి నిరాకరించారు. చివరికి ఆయన కూడా ఆ వైరస్‌ బారినపడ్డారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష విధానాలు సరిగా అందుబాటులో లేకపోవడం, లోపభూయిష్ట పరీక్షలతో వ్యాధి విజృంభించింది. ఈ మహమ్మారితో అక్కడ రెండు లక్షల మందికిపైగా చనిపోయారు. కరోనా ప్రభావానికి ఎక్కువగా లోనైన దేశంగా అమెరికా నిలిచింది.

US_POLLS
కరోనా ప్రభావం

జాతి, వర్ణ వివక్ష, హింస

గత కొద్దినెలలుగా వర్ణ, జాతి వివక్షకు సంబంధించిన ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. శ్వేతజాతి ఆధిపత్యవాదులను సమర్థించడం ద్వారా ఈ సమస్యకు ట్రంప్‌ ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలల కిందట జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు పోలీసుల చేతిలో బలికావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లాయిడ్‌ ఘటనపై ఆందోళనలను నిర్వహించినవారిని లూటీదారులుగా ట్రంప్‌ అభివర్ణించడం మరింత ఆగ్రహానికి కారణమైంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థికి శ్వేత జాతీయుల ఓట్లు ఎక్కువగా పడతాయనుకున్నప్పుడు.. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థికి ఆఫ్రికన్‌-అమెరికన్‌, హిస్పానిక్‌ వర్గాల ఓట్లలో గణనీయ వాటా లభిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

US_POLLS
బ్లాక్​ లివ్స్ మాటర్

తుపాకీ విధానం

అమెరికాలో తుపాకీ హింస నానాటికీ పెరుగుతోంది. ఊచకోతలు ఏటా జరుగుతున్నాయి. దీంతో సామూహిక హననానికి కారణమవుతున్న అసాల్ట్‌ రైఫిళ్లపై నిషేధం విధిస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. స్మార్ట్‌ గన్‌ టెక్నాలజీని ప్రవేశపెడతానంటున్నారు. తుపాకీ యజమాని వేలి ముద్రను గుర్తించాకే ఆ ఆయుధాలు పేలుతాయి. రాజ్యాంగంలోని రెండో సవరణ కింద తుపాకీని కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ట్రంప్‌ వాదిస్తున్నారు. అయితే దేశంలో ఆయుధాలను తేలిగ్గా పొందడానికి వీలు కల్పిస్తున్న కొన్ని లోపాలను సరిదిద్దుతానని హామీ ఇచ్చారు.

US_POLLS
తుపాకీ విధానం

నిరుద్యోగం..

కరోనా కారణంగా అమెరికాలో నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఏప్రిల్‌లో అది కనీవినీ ఎరుగని రీతిలో 14.7 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కోలుకున్నా.. సెప్టెంబర్‌లో 7.9 శాతం ఉంది. మహమ్మారి సమయంలో అమెరికాలో కోటి మందికి ఉద్యోగాలు పోయాయని అంచనా. అయితే ట్రంప్‌ హయాంలో పన్నులు దాదాపు 25 శాతం తగ్గడాన్ని అమెరికన్లు స్వాగతిస్తున్నారు.

విదేశాంగ విధానం..

'అమెరికా ఫస్ట్‌' అనే విధానంపైనే ట్రంప్‌ మొదటి హయాం నడిచింది. అమెరికాకు ప్రాధాన్యమిస్తూ... ప్రపంచంలో పెద్దన్న పాత్ర నుంచి క్రమంగా వైదొలగుతున్న భావన కల్పించారు. ముఖ్యంగా ప్రచ్ఛన్నయుద్ధకాలం నుంచీ సాగుతున్న నాటో మైత్రికి గండి కొట్టారు. కీలకమైన పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. చైనాతోనూ ఘర్షణ వైఖరి అవలంబించారు. ఇటీవలికాలంలో ఏ అధ్యక్షుడూ చేయనంతగా చైనాను తీవ్రంగా ప్రతిఘటించారు. వాణిజ్య యుద్ధానికి దిగారు.

కొవిడ్‌ విషయంలోనైతే చైనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాను చైనా వైరస్‌గా అభివర్ణించారు. వీటిపై అమెరికన్లలో కొంతమేరకు మద్దతు లభించిందంటారు. ఈ మధ్య బహ్రెయిన్‌, యూఏఈలతో చర్చలు జరిపి ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయించడం ట్రంప్‌ సాధించిన విజయం. తాలిబన్లతో శాంతి ఒప్పందం, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో 200 మైళ్ల పొడవునా గోడ నిర్మాణం వంటి అంశాలను ప్రముఖంగా చెబుతున్నారు. ట్రంప్‌ హయాంలో అమెరికా అగ్రస్థానం కోల్పోయిందనేది బైడెన్‌ వాదన. దాన్ని పునరుద్ధరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. బైడెన్‌ వస్తే చైనాతో కాసింత సానుకూల దృక్పథంతో వ్యవహరించే వీలుంది.

ఇదీ చదవండి:ప్రచారం చివరి దశలో 'బ్లాక్ ఓటర్ల'పై బైడెన్ దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.