కరోనా మహమ్మారి కాటుకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 9 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2.77 కోట్ల మంది ఈ వైరస్‌బారిన పడ్డారు. మంగళవారం ఉదయం నుంచి 24 గంటల్లో 2.47 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కొత్తకేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
మొత్తం కేసులు: 27,734,321
మరణాలు: 901,849
కోలుకున్నవారు: 19,828,134
యాక్టివ్ కేసులు: 7,004,338
- కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం రోజుకు 50వేలకుపైగా నమోదైన కేసులు.. గత మూడు రోజుల నుంచి 30వేల లోపే నమోదవటం కాస్త ఊరట కలిగిస్తోంది. మంగళవారం 28వేల కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 65.14 లక్షలకు చేరుకుంది. 1.94లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం మరో 14,279 కొత్త కేసులు నమోదయ్యాయి. 504 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 1,27, 464కు చేరింది.
- ఈజిప్ట్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం 187 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 100,228కి చేరింది.
- నేపాల్‌లో గత వారం రోజులుగా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 2,287 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 68.5 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 6,514,231 | 194,032 |
బ్రెజిల్ | 4,165,124 | 127,517 |
రష్యా | 1,035,789 | 17,993 |
పెరు | 696,190 | 30,123 |
కొలంబియా | 679,513 | 21,817 |
మెక్సికో | 642,860 | 68,484 |