ETV Bharat / international

ట్రంప్-బైడెన్​ భవితవ్యం నిర్ణయించే రాష్ట్రాలు ఇవే.. - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 వార్తలు

అమెరికాలో ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికను పెద్ద రాష్ట్రాలు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు కీలకం కానున్నాయి.

us elections
అధ్యక్షుడి ఎన్నిక
author img

By

Published : Nov 4, 2020, 9:10 AM IST

Updated : Nov 4, 2020, 9:19 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. రెండు పార్టీల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే, ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు.

ఈ రాష్ట్రాలే కీలకం..

అయితే, ఇద్దరి మధ్య స్వల్ప ఆధిక్యమే ఉన్న నేపథ్యంలో పెద్ద రాష్ట్రాల్లో విజయం కీలకం కానుంది. కాలిఫోర్నియా(55), టెక్సాస్ (38), ఫ్లోరిడా (29), న్యూయార్క్ (29), పెన్సిల్వేనియా (20), ఇల్లినాయిస్​ (20), ఓహియో (18) ఫలితాలు అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించనున్నాయి.

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు..

వర్జీనియా, వెర్మాంట్‌, మేరీలాండ్,‌ న్యూజెర్సీ, మాసాచుసెట్స్‌, కొలరాడో, కెనెక్టికట్​, డెలావేర్​లో విజయకేతనం ఎగురవేశారు బైడెన్.

టెన్నెసీ, వెస్ట్‌ వర్జీనియా, కెంటకీ, ఒక్లామా, ఇండియానా, సౌత్‌ కరోలినా, సౌత్ డకోటా, నార్త్ డకోటా రాష్ట్రాలను గెలిచారు ట్రంప్.

ఇదీ చూడండి: ట్రంప్xబైడెన్: రికార్డు ఓటింగ్- హోరాహోరీ ఫలితాలు

Last Updated : Nov 4, 2020, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.