ETV Bharat / international

అమెరికా: నిధుల సేకరణపై డెమొక్రటిక్ పార్టీలో రచ్చ - కాలిఫోర్నియా

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి పీటీ బట్టిగిగ్ చేపట్టిన నిధుల సేకరణను సొంత పార్టీలోని ప్రత్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సౌత్ బెండ్ మేయర్ గా ఉన్న ​బట్టిగిగ్ తన మద్దతుదారుల సాయంతో బిలినియర్లకు విందు ఏర్పాటు చేయించి భారీ మొత్తంలో నిధులను సేకరించారని మండిపడ్డారు.

The California winemakers who hosted a dinner "wine cave" for Democratic presidential hopeful Pete Buttigieg have defended the fundraising event.
అమెరికా: నిధుల సేకరణపై డెమోక్రటిక్ పార్టీలో రచ్చ
author img

By

Published : Dec 21, 2019, 8:28 PM IST

Updated : Dec 21, 2019, 11:47 PM IST

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆశావహులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నాటికి అన్ని విధాలా సిద్ధమై ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో కీలకమైన నిధుల సేకరణ అంశం డెమోక్రటిక్ పార్టీలో వివాదానికి తెరలేపింది.

డెమోక్రటిక్ పార్టీకి చెందిన మేయర్ పీటీ బట్టిగిగ్​ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతుండగా.. ఆయన మద్దతుదారులైన క్రేగ్ హాల్, కాథరిన్ హాల్ దంపతులు నిధుల సేకరణ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

బిలియనీర్లకు మాత్రమే...

నెపా లోయలోని విలాసవంతమైన తమ 'హాల్ రూతర్​ఫోర్డ్' మద్యం తయారీ కేంద్రంలోని కేవ్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్​లో భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్లు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎలిజిబెత్ వారెన్ ఆరోపించారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష చర్చా వేదికపై ఆమె చేసిన వాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఖరీదైన మద్యం షాపులో అక్రమ పద్ధతిలో నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారామె.

నెపా లోయలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వారికి 2,800డాలర్ల విలువ చేసే మద్యం బాటిళ్లతో విందు ఇచ్చినట్లు ఎలిజిబెత్ ఈ సందర్భంగా విమర్శించారు. ఆ విందుకు సంబంధించిన ఫొటోలను చూస్తే ఇది అర్థమవుతుందని దుయ్యబట్టారామె.

వ్యక్తిగత ప్రయోజనం కోసమే...

క్రేగ్ హాల్, కాథరిన్ హాల్ దంపతుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మద్దతుదారులు బట్టిగిగ్ తో వ్యక్తిగతంగా ప్రయోజనం పొందేందుకు వచ్చారు. ఎవరూ కూడా డెమోక్రటిక్ పార్టీ మీద అభిమానంతో వచ్చిన వారిలా కనపడటం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు వారెన్..

భారీ మొత్తంలో విరాళాలు సేకరించడమే లక్ష్యంగా విందుకు బిలీయనర్లను మాత్రమే ఆహ్వానించారని అరోపించారు ఎలిజిబెత్. హాల్ దంపతులు ఆతిథ్యం ఇవ్వడంపై మండిపడ్డ డెమోక్రటిక్ పార్టీ నేత.. వారిని సైతం బిలీయనర్లుగా అభివర్ణించారు. అంతేకాకుండా నెపా లోయలో సేకరించిన బిలీనియర్ల డాలర్లు అమెరికా అధ్యక్షుడిని నిర్దేశించలేవని తీవ్ర విమర్శలు గుప్పించారామె. అయితే ఈ వ్యాఖ్యలను క్రేగ్​ హాల్​ తోసిపుచ్చారు.

"మేం నిర్వహించిన కార్యక్రమానికి బిలీయనీర్లు వచ్చారని నేను అనుకోవట్లేదు. మమ్మల్ని కూడా బిలీయనిర్లుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో 'ఇలాగైనా మనం బిలీయనిర్లం అయ్యాం' అని నా భార్య సంతోషడింది."
-క్రేగ్ హాల్

ఇదీ చదవండి: బిహార్​లో ఆటోలపై విరుచుకుపడ్డ ఆర్జేడీ కార్యకర్తలు

Lucknow (UP), Dec 21 (ANI): While addressing a press conference in Lucknow, Praveen Kumar, Inspector General (Law and Order) for Lucknow, informed that 15 people have died while 705 are in custody since the protests against the Citizenship Amendment Act spread across the state. He said. "In protest against Citizenship Amendment Act since Dec 10 in state, 705 people arrested and around 4500 people released after preventive arrest.15 casualties have happened, and 263 police personnel were injured of which 57 personnel received fire arm injuries."

Last Updated : Dec 21, 2019, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.