ETV Bharat / international

జాక్​పాట్​ కొట్టిన యూట్యూబర్.. 42 సెకన్లలో రూ.1.75కోట్లు!

author img

By

Published : Feb 18, 2022, 2:20 PM IST

Updated : Feb 18, 2022, 3:25 PM IST

NFT Technology: కాలిఫోర్నియాకు చెందిన ఓ టెక్​ యూట్యూబర్​ సెకన్ల వ్యవధిలో కోట్లు సంపాదించారు. కేవలం 42 సెకన్ల వ్యవధిలో సుమారు రూ. 1.75 కోట్ల ఆర్జించి ఓవర్​ నైట్​ సెన్సేషన్​గా మారాడు.

YouTuber
యూట్యూబర్​

NFT Technology: అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్​ ఓవర్​ నైట్​ కోటీశ్వరుడయ్యాడు. కేవలం క్షణాల వ్యవధిలోనే రూ. 1.75 కోట్ల సంపాదించాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్-ఫంగబుల్ టోకెన్‌ల (ఎన్‌ఎఫ్‌టీ) తో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాని సంపాదించి ఓవర్‌నైట్​ సెన్సేషన్‌గా మారాడు. ఆయన పేరే జోనాథన్​ మా. ఈ వచ్చిన డబ్బులతో సినిమా నిర్మాత కావాలనే కోరిక మరి కొద్ది రోజుల్లోనే తీరనున్నట్లు చెప్తున్నాడు. ఈయన గతంలో ఫేస్​బుక్​, గూగుల్​ లాంటి కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా కూడా పని చేశాడు.

కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూట్యూబర్​ 'జోమా టెక్' పేరుతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో, టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఇతని ఛానెల్​కు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో అతను 'వ్యాక్సీడ్​ డాగ్​గోస్​' పేరుతో ఎన్​ఎఫ్​టీ (నాన్-ఫంజిబుల్ టోకెన్) కలెక్షన్​ను విడుదల చేశారు. ఇదే ఆయనకు సుమారు రూ. 1.75 కోట్లను తెచ్చి పెట్టింది. అది కూడా కేవలం 42 సెకన్లలోనే ఖర్చులు పోనూ ఆయనకు రూ. 1.40 కోట్లు మిగిలాయని అంచనా వేస్తున్నారు.

నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే?

ఏదైనా డిజిటల్ కళాకృతిని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపంలో నిలువ చేయడాన్ని (ఓన‌ర్‌షిప్ సర్టిఫికేట్‌) 'ఎన్ఎఫ్‌టీ'గా చెబుతున్నారు. ఎన్​ఎఫ్​టీలను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇతర రకాల ఫైల్స్​ను దాచుకోవచ్చు. అయితే.. ఈ విధంగా కొనుగోలు చేసిన ప్రత్యేక డిజిటల్ ఆస్తిని నిజంగా మనచేతికి ఇవ్వరు.!

ఇదీ చూడండి:

రష్యాతో చర్చలకు ఒకే చెప్పిన అమెరికా.. కానీ ఒక షరతు!

Last Updated : Feb 18, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.