చిలీలో రవాణా ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు చిలీవాసులు. శాంటియాగోలో శుక్రవారం కూడా ఆందోళనలు చేపట్టారు నిరసనకారులు.
వేలాది మంది పెద్ద సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువులు, జల ఫిరంగులను ప్రయోగించారు.
అక్టోబర్ నుంచి జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. 2210 మంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. 188 ఠాణాలు, 971 పోలీస్ వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు.