ప్రపంచవ్యాప్తంగా కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆగంతుకులు పైశాచికంగా కాల్పులు జరుపుతున్నారు. బహిరంగ ప్రదేశాలు, థియేటర్లు, పాఠశాలలు, మైదానాలు... ఇలా పరిసరాలతో సంబంధం లేకుండా హింసకు పాల్పడుతున్నారు.
అమెరికాలో ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువ. ముఖ్యంగా విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దారుణాల నుంచి విద్యార్థులను రక్షించడానికి అమెరికాలోని యూటా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఆగంతుకులను ఎదుర్కొనేందుకు శిక్షణ అందిస్తున్నారు.
"ఈ శిక్షణకు ముందు ఆపద సమయంలో పిల్లలను తీసుకుని పరిగెత్తేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆగంతుకుల ముందు ధైర్యంగా నిలబడగలను. నా దగ్గర ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. పిల్లలను కాపడగలనని నేను అనుకుంటున్నా."
--- క్రిస్టి బెల్ట్, ఉపాధ్యాయురాలు.
ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆయుధాలు తీసుకెళ్లే వెసులబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం వేసవి సేలవులైనప్పటికీ ఈ శిక్షణలో 30 మంది టీచర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- ఫాల్కన్'తో సెట్స్‌లో దుమ్మురేపుతున్న బన్నీ