ETV Bharat / international

కొవిడ్​ రోగుల ఊపిరితిత్తుల్లో చిక్కటి ద్రవం గుట్టు వీడింది.. - కొవిడ్​ రోగుల ఊపిరితిత్తుల్లో చిక్కటి ద్రవం గుట్టు వీడింది ..

కరోనాకు సరికొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేసే దిశగా స్వీడన్​ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. కొవిడ్​ బాధితుల్లో చిక్కటి ద్రవం పేరుకుపోతుండటానికి కారణాలను గుర్తించారు. ఆ ద్రవం నిల్వకాకుండా నివారించగలిగితే చాలామంది రోగుల ప్రాణాలను రక్షించొచ్చునని తెలిపారు.

sweden umia university on corona new studies
కొవిడ్​ రోగుల ఊపిరితిత్తుల్లో చిక్కటి ద్రవం గుట్టు వీడింది ..
author img

By

Published : Oct 8, 2020, 11:36 AM IST

కరోనాకు సరికొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేసే దిశగా కీలక ముందడుగు వేశారు స్వీడన్​ పరిశోధకులు. కొవిడ్​ తీవ్రత ఎక్కువగా ఉన్నవారితోపాటు కరోనా కారణంగా మృతి చెందినవారి ఊపిరితిత్తులు చిక్కటి ద్రవంతో నిండి ఉండటాన్ని వైద్య నిపుణులు ఇటీవల పలు కేసుల్లో గుర్తించారు. ఆ ద్రవం ఉత్పత్తికి కారణమేంటన్నది మాత్రం ఇన్నాళ్లూ తెలియరాలేదు. మానవుల్లో సాధారణంగా గాయాలు మానేందుకు దోహదపడే 'హయలు రోనన్' అనే పాలీశాకరైడ్​ ఇందుకు మూల కారణమని స్వీడన్​లోని ఉమియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా తేల్చారు. నీటి అణువులకు అతుక్కోవటం ద్వారా హయలురోనన్ ఊపిరితిత్తుల్లో చిక్కటి ద్రవాన్ని ఏర్పరుస్తోందని నిర్ధారించారు. అది కొవిడ్​ రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలిపారు. హయలురోనన్​ ఉత్పత్తిని మందగింపజేసే చికిత్సామార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వారు చెప్పారు. హైమెర్​క్రోమోన్​ అనే ఔషధం సహా కొన్ని ఎంజైములు ఈ పాలీశాకరైడ్​ను నిలువరించగలవని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.