ETV Bharat / international

గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

author img

By

Published : Jun 11, 2020, 7:44 AM IST

వాతావరణంలో అధిక వేడి ఉంటే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు భిన్నంగా ఎండ ఉన్నప్పటికీ వైరస్ కేసులు పెరగడాన్ని అడ్డుకోలేదని తేల్చింది కెనడాకు చెందిన మెక్​మాస్టర్ నివేదిక. ఎండ కాయడం వల్ల ప్రజల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతుందని ఈ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని అంచనా వేసింది.

sun rays cant kill corona virus
గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణకు ఆస్కారం!

వాతావరణంలో అధిక వేడి, తేమ ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పడం విన్నాం. అయితే... గంటల తరబడి ఎండ ఉన్నా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఎక్కువసేపు ఎండ కాయడం ప్రజల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతోందని, ఫలితంగా ఎక్కువమంది వైరస్‌ బారిన పడేందుకు ఆస్కారం ఏర్పడుతోందని కెనడాకు చెందిన మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా కేసుల తీరు ఎలా ఉందన్న విషయమై వీరు అధ్యయనం సాగించారు.

సుమారు 3 లక్షల కొవిడ్‌-19 కేసులతో అల్లాడుతున్న స్పెయిన్‌లో వారు 30 రోజుల పాటు విశ్లేషణ చేపట్టారు. 'వాతావరణంలో వేడి, తేమ ఒక్క శాతం పెరిగితే, కొవిడ్‌-19 వ్యాప్తి 3% తగ్గుతున్నట్టు గుర్తించాం. అధిక ఉష్ణోగ్రతలు వైరస్‌ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే ఇందుక్కారణం. అలాగని గంటల తరబడి ఎండ ఉన్న రోజుల్లోనూ వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది. ఎక్కువసేపు ఎండ ఉన్న రోజుల్లో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి బయటకు వస్తున్నారు. ఫలితంగా వైరస్‌ సంక్రమణం ఎక్కువవుతోంది' అని పరిశోధనకర్త ఆంటానియో పయీజ్‌ వివరించారు. జియోగ్రాఫికల్‌ అనాలసిస్‌ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది.

ఇదీ చూడండి: కరోనా ఫ్యాషన్.. అందుబాటులో డిజైనర్ మాస్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.