ETV Bharat / international

అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ- నలుగురు మృతి - అమెరికా ఎన్​కౌంటర్స్​

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూజెర్సీలోని పీటర్​సన్​ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

Street shooting leaves 4 dead, 3 wounded in New Jersey
అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ- నలుగురు మృతి
author img

By

Published : Jul 9, 2020, 5:25 AM IST

అమెరికా తుపాకీ సంస్కృతి మరోసారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. న్యూజెర్సీ రాష్ట్రం పీటర్​సన్​లోని ఓ వీధిలో కొంతమంది దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

దుండగులు ఓ వాహనం ద్వారా అక్కడికి చేరుకున్నారని, అయితే ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియదని స్థానికులు చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడి జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై పాసాయిక్​ కౌంటీ ప్రాసిక్యూటర్​ కార్యాలయ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ట్రంప్ సర్కార్‌ నిర్ణయంపై విద్యాసంస్థల న్యాయ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.