ETV Bharat / international

గెలుపైనా.. ఓటమైనా... నిను వీడని నీడ మేమే! - అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్

వరుసగా రెండోసారి అధ్యక్షుడు కావాలని కలలుగని విఫలమైన డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ 2024లో ఆ పదవి కోసం ప్రయత్నిస్తారా? అవును.. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్​ అభిమానులు సిద్ధమయ్యారు. తమ ప్రియతమ నేత​ను మరోసారి అధికార పీఠంపై ట్రంప్​ను కూర్చోబెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పని మొదలుపెడుతున్నారు.

Trump's fans part of his legacy
గెలుపైనా? ఓటమైనా? నిను వీడని నీడలు మేమే!
author img

By

Published : Jan 4, 2021, 6:27 PM IST

"ఎవరు వాళ్లు..? ఫ్యాన్స్​.. నా డై హార్డ్​ ఫ్యాన్స్​.." ఇది ఓ చిత్రంలో డైలాగ్​. అయితే ఈ సంభాషణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు సరిగ్గా సరిపోతోంది. ఇందుకు చాలానే కారణాలున్నాయి.

'అమెరికా ఫస్ట్' నుంచి 'మేక్​ అమెరికా గ్రేట్​ ఎగైన్' వరకు... ట్రంప్​ నోటి నుంచి వచ్చిన మాట ఏదైనా ఆయన అభిమానులకు అది శిరోధార్యం. ఎందుకంటే అధ్యక్ష పదవిలో ఓడిపోయి.. ఎన్నికల తీరు, ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ట్రంప్​ అభిమానులు ఆయన్ను ఏనాడు వదల్లేదు. "గెలుపైనా, ఓటమైనా ట్రంప్​తోనే" అన్నట్లు ఆయన వెంటే నిలిచారు. ప్రస్తుతం బైడెన్​కు సవాళ్ల సవారీతో శ్వేతసౌధానికి స్వాగతం పలకబోతోన్న ట్రంప్​ను తిరిగి 2024లో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన అభిమానులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

బైడెన్​కు సవాల్​..

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే సోషల్​ మీడియాలో బైడెన్​పై ట్రంప్​ అభిమానులు విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. ట్రంప్​పై బైెడెన్​ విజయం చట్టవిరుద్ధమంటూ నానా హడావుడి చేశారు. అయితే ట్రంప్​ న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్​లు అన్నీ వీగిపోవడం వల్ల చేసేదేమీ లేక ఇప్పుడు బైడెన్​ అధికారంలోకి వచ్చాక విమర్శలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనే మెరుగ్గా ఉందనేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ట్రంప్​కు సాధ్యమా..?

2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ బరిలోకి దిగాలని అనుకుంటే​ ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే, రిపబ్లికన్‌ పార్టీలో తన అవకాశాలను కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌కు తిరుగులేని పరిస్థితి. ఓడిపోయినా ప్రజల్లోనూ ఆయనకు బలమైన మద్దతుందనే సంగతి ఈ ఎన్నికల్లో రుజువైంది. 2024లో ట్రంప్‌ 78 ఏళ్ల వయసుకొస్తారు. అదేమీ అనర్హత కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఎంపికైన బైడెన్‌కు ఇప్పుడు అదే వయసు.

"ప్రస్తుతం రిపబ్లికన్​ పార్టీ అంటే అది ట్రంప్​ పార్టీ అనే ఆలోచనే వస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలనే పార్టీ అనుసరిస్తుంది. 2024లో రిపబ్లికన్​ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలబడే కొత్త వ్యక్తులకు ట్రంప్​ నుంచి గట్టి పోటీ ఉంటుంది."

- మిట్​ రామ్నీ, 2012 రిపబ్లికన్​ అధ్యక్ష అభ్యర్థి

"ఆధునిక రాజకీయ చరిత్రపై ట్రంప్​ ప్రభావం విపరీతంగా ఉంది. అందుకే ఓడిపోయినప్పటికీ పార్టీలో ఆయన స్థానంపై ఎలాంటి సందేహాలు ఉండకపోవచ్చు. ఆయనకు ఇంతకుముందు ఓడిపోయిన అధ్యక్షుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయనకు ఓటు వేసిన 7 కోట్లకు పైగా ఓటర్ల అభిప్రాయాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకోవాలి."

- ఫరా, శ్వేతసౌధం కమ్యూనికేషన్ మాజీ​ డైరెక్టర్​

"అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున విభేదాలు రావడానికి కారణం ట్రంపిజం. ఇది భవిష్యత్తులోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా ట్రంప్​ చేశారు. కానీ ఆయన అభిమానులే ట్రంప్​కు ప్రధానమైన బలం."

- చార్లీ స్కైస్​, రాజకీయ విమర్శకుడు

ఏం చేస్తారు..?

ఓటమిని ట్రంప్​ అంత తేలిగ్గా తీసుకునే వ్యక్తి కాదని.. సొంత టెలివిజన్‌ నెట్‌వర్క్‌, మీడియా సంస్థను నెలకొల్పే అవకాశం లేకపోలేదని ఆయన అభిమానులు అంటున్నారు. సోషల్​ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్​ వేదికగా బైడెన్​ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో తన గుర్తింపును కాపాడుకునేలా ట్రంప్​ వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరి 2024 అధ్యక్ష రేసులో ట్రంప్​ నిలబడి విజయం సాధిస్తారా? ఆయన అభిమానులు మరోసారి ఆయనకు మద్దతుగా నిలుస్తారా? వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.