ETV Bharat / international

ఒక్క డోసుతోనే కరోనాను అంతం చేసే టీకా!

ఒక్క డోసుతోనే కరోనాను ఎదుర్కొనేలా రోగ నిరోధక శక్తిని పెంచే టీకాను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. పేద, మధ్యతరగతి దేశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నామని వెల్లడించారు.

covid vaccine, stanford university, కరోనా టీకా, అమెరికా పరిశోధకులు
ఒక్కడోసు టీకాతో రోగనిరోధక శక్తి!
author img

By

Published : Jan 11, 2021, 6:10 PM IST

అమెరికా స్టాన్​ఫర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొత్త రకం కొవిడ్ టీకాను రూపొందించారు. ఇది ప్రస్తుతం ఉన్న టీకాల కంటే ఎక్కువ సామర్థ్యం గలదని, దీనిని ఎలుకలపై ప్రయోగించగా ఒక్క డోసుతోనే వాటిలో రోగనిరోధక శక్తిని పెంచిందని వెల్లడించారు.

చౌకగా టీకా..

ఓ జర్నల్​లో ఈ టీకా గురించి ప్రచురించారు. ఇందులో కరోనా వైరస్​కు చెందిన ప్రొటీన్​ స్పైక్స్​తో జత చేసిన అతిసూక్ష్మ కణాలు ఉంటాయని తెలిపారు.

"ఒక్కడోసులోనే కరోనాను అంతం చేయగల వ్యాక్సిన్​ను రూపొందించడమే మా లక్ష్యం. ఇందులో మేము విజయవంతం అయితే.. చౌకగా కూడా లభిస్తుంది. పేద, మధ్య తరగతి దేశాలను దృష్టిలో పెట్టుకుని టీకాను తయారు చేస్తున్నాము."

-పీటర్​ కిమ్​, స్టాన్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు

ఈ వ్యాక్సిన్​ను భద్రపరచడానికి అతి శీతల ఉష్ణోగ్రతలు అవసరం లేదని పరిశోధకులు తెలిపారు. దీనిపై మరింత పరీక్షలు జరపాల్సి ఉందని, త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇది చదవండి : ప్రపంచవ్యాప్తంగా మరో 6లక్షల పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.