ETV Bharat / international

ట్విట్టర్​కు చెక్ పెట్టేలా ట్రంప్​ 'పార్లర్​ స్కెచ్'! - trump parler updates

ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రాం తన ఖాతాలపై నిషేధం/ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త ప్లాట్​ఫాం వైపు చూస్తున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. రెండేళ్లలోనే 12 మిలియన్ల యూజర్లను ఆకర్షించిన పార్లర్ సామాజిక మాధ్యమాన్ని ఆయన ఎంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే పార్లర్​ యాప్​నూ గూగుల్, యాపిల్​ ప్లే స్టోర్ల నుంచి తొలగించాయి. దాని వెబ్ హోస్టింగ్​ను అమెజాన్​ నిలిపివేసింది. దీంతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ట్రంప్​ ప్రారంభిస్తారేమో అని నిపుణులు భావిస్తున్నారు.

Squelched by Twitter, Trump seeks new online megaphone
ట్విట్టర్​కు ప్రత్యామ్నాయంగా పార్లల్​ వైపు ట్రంప్​ చూపు!
author img

By

Published : Jan 10, 2021, 4:28 PM IST

అమెరికా క్యాపిటల్ భవనంలో బుధవారం చెలరేగిన హింసకు అధ్యక్షుడు ట్రంప్​ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఆయన ఖాతాపై ట్విట్టర్​ శాశ్వత నిషేధం విధించింది. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రాం కూడా ట్రంప్​ ఖాతాలపై తాత్కాలిక ఆంక్షలకు ఉపక్రమించాయి. దీంతో సరికొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలని ట్రంప్ భావిస్తున్నారు. మార్కెట్లో ఆదరణ చూరగొన్న కొత్త ప్లాట్​ఫాంలపైనా ఆయన ఆసక్తి చూపుతున్నారు.

రెండేళ్ల క్రితం సేవలు ప్రారంభించి, యూజర్లను ఆకట్టుకుంటున్న పార్లర్ సామాజిక మాధ్యమాన్ని ట్రంప్​ ఎంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పార్లర్​లో ఇప్పటికే ట్రంప్​ కుమారులు ఎరిక్​, జూనియర్​ ట్రంప్​ యక్టివ్​గా ఉన్నారు. 2018లో ప్రారంభమైన ఈ యాప్​ను దాదాపు 1.2కోట్ల మంది వినియోగిస్తున్నారు.

" మేము చాలా వెబ్​సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నాము. దీనిపై త్వరలో కీలక ప్రకటన చేస్తాం. భవిష్యత్తులో సరికొత్త ప్లాట్​ఫాంను ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

పార్లర్​పైనా ఆంక్షలు

అయితే పార్లర్​ యాప్​ను గూగుల్​, యాపిల్ సంస్థలు ప్లే స్టోర్ల నుంచి తొలగించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ప్రజా భద్రత సమస్యను పరిష్కరిస్తేనే రీస్టోర్​ చేస్తామని చెప్పాయి. ఆ మరునాడే అమెజాన్​ కూడా పార్లర్​కు షాక్​ ఇచ్చింది. తాము అందిస్తున్న వెబ్​ సర్వీసెస్​ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పార్లర్​​ వారం రోజుల పాటు ఆఫ్​లైన్​కే పరిమితం కావాల్సిన పరిస్థితి తెలెత్తింది.

గూగుల్​, యాపిల్, అమెజాన్ నిర్ణయాలపై పార్లర్​ సీఈఓ జాన్ మట్జే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్​లో పోటీతత్వాన్ని నశింపజేసేందుకు దిగ్గజ సంస్థలు కలిసికట్టుగా తమపై చర్యలు తీసుకున్నాయని ఆరోపించారు. వారం రోజుల్లోనే పార్లర్ యాప్​ను రీబిల్డ్ చేస్తామని చెప్పారు. రాజకీయ దురుద్దేశం, స్వేచ్ఛా వాదాన్ని ద్వేషించే అధికారులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

మరో ప్రత్యామ్నాయం గ్యాబ్​..

పార్లర్​ కాకుండా గ్యాబ్​ను కూడా ట్రంప్​ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశాలున్నాయి. 2016లో ప్రారంభించిన ఈ యాప్​పైనా ఆంక్షలు ఉన్నాయి. 11 మందిని హత్య చేసిన నేరస్థుడిని ప్రేరేపించేలా పోస్టులు ఉన్నాయనే కారణంతో 2017లోనే గూగుల్, యాపిల్ సంస్థలు తమ ప్లే స్టోర్ల నుంచి గ్యాబ్​ను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ కూడా వెబ్​ సర్వీస్​ను నిలిపివేేసింది. దీంతో గ్యాబ్ ప్రస్తుతం వెబ్​ హోస్టింగ్​ సమస్యలను ఎదుర్కొంటోంది.

ట్రంప్​ ఖాతాలపై దాదాపు అన్ని సామాజిక మాధ్యమాలు ఆంక్షలు విధించాయి. ఆయనకు 89 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్​ ఖాతా శాశ్వత నిషేధానికి గురైంది. జనవరి 20న నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం జరిగే వరకు ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించే అవకాశాలు కన్పించడం లేదు. స్నాప్​చాట్​ కూడా ట్రంప్ ఖాతాలను డిసేబుల్​ చేసింది. ట్రంప్​తో సంబంధమున్న ఆన్​లైన్​ స్టోర్లను షాపిఫై నిలిపివేసింది. ట్రంప్​కు సబ్​గ్రూప్​ను రెడ్డిట్​ తొలగించింది. దీంతో ట్రంప్​ కొత్త ప్లాట్​ఫాంపై దృష్టి సారించారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ .. భవిష్యత్‌లోనూ పోటీ చేయకుండా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.