ETV Bharat / international

అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాముల తిరుగు పయనం

నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్​ఎక్స్ క్రూ డ్రాగన్​ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరుగు పయనమైంది. భూమి పైకి తిరిగి వస్తున్న వారిలో ముగ్గురు నాసాకు చెందిన వారు కాగా.. ఒకరు జపాన్ వ్యోమగామి ఉన్నారు.

space X crew dragon
వ్యోమనౌక, స్పేస్ ఎక్స్
author img

By

Published : May 2, 2021, 11:55 AM IST

నలుగురు వ్యోమగాములతో స్పేస్​ఎక్స్ క్రూ-1 వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగివస్తోంది. శనివారం సాయంత్రం అది ఐఎస్​ఎస్​ నుంచి బయలుదేరినట్లు స్పేస్​ఎక్స్ పేర్కొంది. వ్యోమనౌకలో ముగ్గురు నాసాకు చెందిన వారు కాగా.. జపాన్​కు చెందిన ఒకరు తిరిగి వస్తున్నారు. ఈ వ్యోమనౌక ఆరున్నర గంటలు ప్రయాణం చేసి.. ఫ్లోరిడా మెక్సికో తీరంలోని పనామా సిటీకి చేరుకోనుందని స్పేస్​ఎక్స్ తెలిపింది.

ఇదీ చదవండి:అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న నలుగురు వ్యోమగాములు

నాసా వ్యోమగాములు మైక్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, షానన్ వాకర్, జపాన్​ వ్యోమగామి సోయిచ్చి నోగుచ్చి ఈ స్పేస్​ ఎక్స్​ క్రూ డ్రాగన్​ వ్యోమనౌక ద్వారా గత నవంబర్​లో ఐఎస్​ఎస్​కు వెళ్లారు. ప్రస్తుతం ఐఎస్​ఎస్​లో ఏడుగురు వ్యోమగాములున్నారు. 1968లో 'అపోలో 8' తర్వాత అమెరికాలో రాత్రివేళ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవడం ఇదే తొలిసారి కానుంది.

ఇదీ చదవండి:బైడెన్​కు కిమ్​ సర్కార్​ తీవ్ర హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.