ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది స్పేస్ఎక్స్. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది. డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా నలుగురిని కక్ష్యలోకి పంపనున్నట్లు వెల్లడించింది.
'షిఫ్ట్4 పేమేంట్స్' సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తారని స్పేస్ఎక్స్ తెలిపింది. మరో ముగ్గురి పేర్లను ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.
"జేర్డ్ ఐసాక్‌మన్ డ్రాగన్ వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తారు. ఇన్స్పిరేషన్4 సిబ్బంది డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌తో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో వాణిజ్య శిక్షణను పొందుతారు. ఆర్బిటాల్ మెకానిక్స్, శూన్య గురుత్వాకర్షణ(జీరో గ్రావిటీ)ను తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నాం. అత్యవసర సన్నద్ధత, స్పేస్‌సూట్-స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్పై శిక్షణ అందనుంది."
-స్పేస్ఎక్స్
మిషన్ పూర్తయిన తర్వాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్.. భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఫ్లోరిడాలోని తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది.
ఇదీ చదవండి: తొలి ప్రైవేటు అంతరిక్షయాత్ర.. టికెట్టు ఎంతో తెలుసా?