ETV Bharat / international

మరోసారి పేలిన స్టార్​షిప్ నమూనా రాకెట్

author img

By

Published : Feb 3, 2021, 6:35 AM IST

స్పేస్​ఎక్స్ స్టార్​షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. ల్యాండింగ్ చివరి నిమిషంలో నమూనా రాకెట్ పేలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ఇలా రాకెట్ పేలిపోవడం ఇది రెండోసారి.

spacex-mars-prototype-rocket-explodes-upon-landing
మరోసారి పేలిన స్టార్​షిప్ నమూనా రాకెట్

అంగారక గ్రహం మీదకు వెళ్లాలన్న లక్ష్యంతో స్పేస్ఎక్స్ సంస్థ తయారు చేసిన స్టార్​షిప్ నమూనా ప్రయోగం విఫలమైంది. మంగళవారం చేపట్టిన ప్రయోగంలో స్టార్​షిప్ రాకెట్.. ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది. ఇలా జరగడం ఇది రెండోసారి. డిసెంబర్​లో నిర్వహించిన పరీక్షల్లోనూ రాకెట్.. ల్యాండింగ్ చివరి క్షణాల్లో పేలింది.

రాకెట్ సజావుగా కిందకు దిగేందుకు ఇంజిన్లను మండించి, కొద్ది సమయం ఆపి మళ్లీ మండించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారమే ప్రయోగం జరిగినప్పటికీ లాంచ్​ప్యాడ్​ వద్దకు చేరుకోగానే రాకెట్ ఒక్కసారిగా అగ్నిగోళంలా మండిపోయిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని పేర్కొంది.

స్టార్​షిప్ రాకెట్ పూర్తిస్థాయి పునర్వినియోగ వాహక నౌక. అంగారకుడితో పాటు, చంద్రుడిపైకి మనుషులను పంపించేందుకు స్పేస్ఎక్స్ దీన్ని తయారు చేస్తోంది. మనుషులను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకూ ఇది ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.