నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ ప్రయోగించిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన ఈ వ్యోమ నౌక.. శనివారం ఉదయం ఐఎస్ఎస్ను చేరిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.
స్పేస్ఎక్స్ సంస్థకు ఇది మూడో మానవసహిత మిషన్ కాగా.. ఇదివరకు మిషన్లలో ఉపయోగించిన రాకెట్ బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి. వీరి రాకతో ఐఎస్ఎస్లో వ్యోమగాముల సంఖ్య 11కు చేరిందని నాసా తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో ఇంతమంది ఉండటం ఇదే తొలిసారని పేర్కొంది.
-
"Endeavour arriving!" Welcome to the @Space_Station, Crew-2!
— NASA (@NASA) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Their arrival means there are now 11 humans aboard our orbiting laboratory, a number not seen since the space shuttle era. Hugs abound. pic.twitter.com/uSwW3JFl6K
">"Endeavour arriving!" Welcome to the @Space_Station, Crew-2!
— NASA (@NASA) April 24, 2021
Their arrival means there are now 11 humans aboard our orbiting laboratory, a number not seen since the space shuttle era. Hugs abound. pic.twitter.com/uSwW3JFl6K"Endeavour arriving!" Welcome to the @Space_Station, Crew-2!
— NASA (@NASA) April 24, 2021
Their arrival means there are now 11 humans aboard our orbiting laboratory, a number not seen since the space shuttle era. Hugs abound. pic.twitter.com/uSwW3JFl6K
ఈ యాత్రలో నాసా వ్యోమగాములు షేన్ కింబ్రో, మేఘన్ మెకార్తర్, ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందిన థామస్ పెస్కెట్, జపాన్ అంతరిక్ష సంస్థకు చెందిన అకిహికో హొషిదే భాగస్వాములయ్యారు. ఆరు నెలల పాటు వీరు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. జీవ, శాస్త్రీయ దృగ్విషయాలపై వీరు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ పరిస్థితులు వీరి అధ్యయనానికి ఉపకరించనున్నాయి.
ఇదీ చదవండి- ఇండోనేసియా జలాంతర్గామి శకలాలు లభ్యం