అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన ఇద్దరు మహిళా వ్యోమగాములు చరిత్ర సృష్టించనున్నారు. పురుషులెవరూ లేకుండా క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్‌లు నేడు స్పేస్‌వాక్ చేయనున్నారు. ఈ సాహసం చేసిన పూర్తి స్థాయి తొలి మహిళా బృందంగా వీరు చరిత్ర సృష్టించనున్నట్లు నాసా ట్వీట్ చేసింది.
-
On Friday, Oct. 18, @astro_christina and @astro_jessica will venture outside @Space_Station for a spacewalk, the first to be performed by two women. A preview of tomorrow's event and a look at more history-making women in space: https://t.co/ahm7CCXEs4 pic.twitter.com/mJCcmtB7m7
— NASA (@NASA) October 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">On Friday, Oct. 18, @astro_christina and @astro_jessica will venture outside @Space_Station for a spacewalk, the first to be performed by two women. A preview of tomorrow's event and a look at more history-making women in space: https://t.co/ahm7CCXEs4 pic.twitter.com/mJCcmtB7m7
— NASA (@NASA) October 17, 2019On Friday, Oct. 18, @astro_christina and @astro_jessica will venture outside @Space_Station for a spacewalk, the first to be performed by two women. A preview of tomorrow's event and a look at more history-making women in space: https://t.co/ahm7CCXEs4 pic.twitter.com/mJCcmtB7m7
— NASA (@NASA) October 17, 2019
లోపాలు సరిదిద్దేందుకే..
50ఏళ్ల నుంచి ఇప్పటివరకు 420 సార్లు స్పేస్‌వాక్ చేయగా....వారిలో పురుష వ్యోమగాములే ఎక్కువగా ఉన్నారు. కానీ ఇవాళ జరిగే 421వ స్పేస్‌వాక్‌లో పురుషులెవ్వరూ ఉండరు. నలుగురు సభ్యుల పురుష వ్యోమగాములు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉంటారు. మహిళా వ్యోమగాములైన క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ అంతరిక్షంలో స్పేస్‌వాక్‌చేసి.. ఐఎస్ఎస్లో బ్యాటరీ లోపాలను సరిచేయనున్నారు.
మూడు రోజులుగా కసరత్తులు
గతవారం కోచ్‌తోపాటు మరో పురుష వ్యోమగామి బ్యాటరీలను అమర్చారు. కంట్రోల్ వ్యవస్థలో సమస్య తలెత్తినందున మిగిలిన వాటి అమరికను నిలిపివేశారు. ప్రస్తుతం ఆ లోపాన్ని సరిదిద్దడానికి స్పేస్‌వాక్ చేయనున్న ఇద్దరు మహిళా వ్యోమగాములు మూడు రోజులుగా సన్నద్ధమవుతున్నారు.