ETV Bharat / international

ఆ సముద్రం చైనా 'జల సామ్రాజ్యం' కాదు: పాంపియో - పాంపియో

దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా వాదనపై అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో మండిపడ్డారు. ఆ సముద్రం చైనా 'జల సామ్రాజ్యం' కాదని తెలిపారు. ప్రపంచ దేశాలు చైనాను ఇలాగే వదిలేస్తే.. కమ్యూనిస్ట్​ పార్టీ ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుందని హెచ్చరించారు

South China Sea is not Beijing's 'maritime empire', says Pompeo
ఆ సముద్రం చైనా 'జల సామ్రాజ్యం' కాదు: పాంపియో
author img

By

Published : Jul 26, 2020, 5:16 AM IST

చైనాపై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం(ఎస్​సీఎస్​).. చైనా 'జల సామ్రాజ్యం' కాదని.. ఈ విషయంపై అమెరికా వైఖరి స్పష్టంగా ఉందని తెల్చిచెప్పారు.

"ఈ విషయంపై అమెరికా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఎస్​సీఎస్​.. చైనా జల సామ్రాజ్యం కాదు. అంతర్జాతీయ చట్టాలను చైనా ఉల్లంఘిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు చూస్తూ ఉండిపోతే.. ఆ దేశ కమ్యూనిస్ట్​ పార్టీ ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుంది. చైనా సముద్రంపై ఉన్న వివాదాలను అంతర్జాతీయ చట్టాలతో పరిష్కరించాలి."

--- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.

దక్షిణ చైనా సముద్రం.. మూడు ద్వీపాల సమూహం. అయితే సముద్రం మొత్తం మీద తమకు సార్వభౌమాధికారం ఉందని చైనా వాదిస్తోంది. ఈ వాదనకు బలంచేకూర్చడానికి గత కొంతకాలంగా పలు చర్యలు కూడా చేపట్టింది. అయితే వీటిని అమెరికా ఖండించింది.

వాణిజ్య యుద్ధంతో అమెరికా-చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా.. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైరస్​తో పాటు ఎస్​సీఎస్​ విషయంలోనూ అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇదీ చూడండి- ఇక మీదట చైనాపై అవే మా విధానాలు: పాంపియో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.