ETV Bharat / international

ట్రంప్​ ఖాతాపై స్నాప్​ఛాట్​ శాశ్వత నిషేధం

క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఖాతాను శాశ్వతంగా తొలగించాలని స్నాప్​ఛాట్ నిర్ణయించింది. ట్రంప్ ఖాతా పదే పదే తమ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తప్పడం లేదని స్పష్టం చేసింది.

Snapchat Permanently bans Trump account
ట్రంప్ ఖాతాను బ్యాన్​ చేసిన స్నాప్​చాట్
author img

By

Published : Jan 14, 2021, 11:30 AM IST

Updated : Jan 14, 2021, 12:47 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు సామాజిక మాధ్యమాల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రముఖ ఫొటో మెసేజింగ్​ యాప్​ స్నాప్​ఛాట్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తమ ప్లాట్​ఫామ్ నుంచి తొలగించాలని నిర్ణయించింది.

అమెరికా క్యాపిటల్​ భవనంపై జరిగిన హింసాత్మక ఘటనకు ట్రంప్ కారకులయ్యారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కారణంతో ఇప్పటికే ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​లు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి.

నిషేధం సరైందే: జాక్​ డోర్సే

అమెరికా కాంగ్రెస్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి తర్వాత ట్విట్టర్​‌ చేపట్టిన చర్యలను కంపెనీ సీఈఓ జాక్‌ డోర్సే సమర్థించుకున్నారు. ఈ ఘటన తర్వాత‌ ట్రంప్‌ ఖాతాను తొలగించిన తెలిసిందే. ట్విట్టర్​‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై ట్విట్టర్​‌‌ సీఈఓ జాక్‌‌ డోర్సే స్పందిస్తూ ట్రంప్‌ ఖాతాను నిషేధించడం సరైన నిర్ణయమే కానీ.. అదోక ప్రమాదకరమైన ఉదాహరణగా మిగిలిపోతుందని అంగీకరించారు. ట్రంప్‌ ఖాతాలో పోస్టు చేసిన అంశాలు హింసను ప్రేరేపించేలా ఉండటం వల్ల 88 మిలియన్ల ఫాలోవర్లులున్న ఖాతాను నిషేధించింది. కానీ ఇటువంటి విషయాలు ప్రజల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని డోర్సే ట్విట్టర్​‌లో తెలిపారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు ఫేస్​బుక్, ట్విట్టర్ వరుస షాకులు

Last Updated : Jan 14, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.