ETV Bharat / international

కుప్పకూలిన జెట్ విమానం- నలుగురు దుర్మరణం

Small business jet crash: అమెరికాలో బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శాన్​ డియాగోలో సోమవారం రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

small business jet crash
small business jet crash
author img

By

Published : Dec 29, 2021, 9:18 AM IST

Updated : Dec 29, 2021, 10:27 AM IST

విమాన ప్రమాద దృశ్యాలు

Small business jet crash: అమెరికా శాన్​ డియాగోలో విమానం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపాటి బిజినెస్ జెట్ విమానం.. నగరంలోని ఎల్ కజోన్ ప్రాంతంలో సోమవారం రాత్రి 7 గంటల తర్వాత కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

small business jet crash
విమాన శకలాలు

San Diego plane crash

టేకాఫ్​కు ముందు విమానంలో నలుగురే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని చెప్పారు.

నగరంలోనే విమానం కూలడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసమైందని అధికారులు తెలిపారు. విద్యుత్ తీగలకు తగలడం వల్ల స్థానికంగా పవర్ సప్లై నిలిచిపోయిందని వెల్లడించారు. అయితే, కింద ఉన్న ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంపై అమెరికా నేషనల్ ట్రాన్స్​పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తోంది.

ఇదీ చదవండి: కార్లలో కరోనా పరీక్షలకు.. ఆస్పత్రుల వద్ద భారీ క్యూ

Last Updated : Dec 29, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.